దేశ వ్యాప్తంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడతగా తెలంగాణ.. ఏపీ.. ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో పరిమితంగా ఎన్నికల పోలింగ్ సాగింది. అదే సమయంలో తెలంగాణలో మొత్తం లోక్ సభ స్థానాలకు.. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ.. లోక్ సభ స్థానాలకు పోలింగ్ ను ఒక్కసారిగా పూర్తి చేయటం తెలిసిందే. పోటాపోటీగా జరిగిన ఏపీ ఎన్నికలు ఇప్పుడు అందరి నోటా నానుతున్నాయి. గెలుపు ఎవరిదన్న విషయంపై భారీగానే అంచనాలు వినిపిస్తున్నాయి . ఇలాంటి వేళ.. ఢిల్లీకి చెందిన రాజకీయ విశ్లేషణ.. పరిశోధనల కేంద్రం తాజాగా వార్తల్లోకి వచ్చింది.
ఈ కేంద్రం ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయం మీద అంచనా వేసింది. జగన్ నేతృత్వం లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజేతగా నిలుస్తుందని తేల్చింది. అసెంబ్లీ.. లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సీట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంటుందన్న అంచనా వేసింది. ఈ సంస్థ అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 129 సీట్లు ఖాయమని తేల్చింది. టీడీపీ 49 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొంది. ఇక.. జనసేనకు నాలుగైదు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. తమ అంచనాకు కొంచెం ఎక్కువ తక్కువలు ఉండొచచని పేర్కొంది. అసెంబ్లీలో జగన్ పార్టీకి విజయం పక్కా అని.. లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ కు 18 ఎంపీ స్థానాల్లో గెలుపు పక్కా అని అంచనా వేసింది.
తెలుగుదేశం పార్టీ ఏడు ఎంపీ స్థానాల్ని కైవశం చేసుకునే అవకాశం ఉందని.. జనసేన బోణీ కొట్టదని తేల్చింది. ఇక.. తెలంగాణ విషయానికి వస్తే.. కేసీఆర్ లెక్కలకు భిన్నమైన మాటను చెప్పింది. కారు.. సారు.. పదహారు నినాదం వర్క్ వుట్ అయ్యే అవకాశం లేదని పేర్కొంది. 14 స్థానాల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని.. కాంగ్రెస్.. బీజేపీ.. మజ్లిస్ ఒక్కొక్క స్థానంలో విజయం సాధిస్తారని పేర్కొంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాల్ని దగ్గరగా అంచనా వేయటంలో ముందున్న ఈ సంస్థ అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వస్తాయా? అన్నది తేలాలంటే మే 23 ఉదయం 11 గంటల వరకూ వెయిట్ చేయాల్సిందే.