ష‌ర్మిల‌ను గుర్తించండి.. లేక‌పోతే.. క్ష‌మించండి.. స‌టైర్ల మీద స‌టైర్లు!

Update: 2021-07-19 13:30 GMT
తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.. రాజ‌కీయ పార్టీ పెట్టిన ష‌ర్మిల‌కు .. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున స‌టైర్లు పేలుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలోని డైలాగుల‌తో ష‌ర్మిల పార్టీపై.. సోష‌ల్ మీడియాలో స‌టైర్లు పేలుతున్నాయ‌ని కార్య‌క‌ర్త‌లే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో రాజకీయంగా దూకుడు చూపేందుకు.. ష‌ర్మిల హాట్ కామెంట్లే చేస్తున్నా రు. అటు అధికార పార్టీ టీఆర్ ఎస్‌పైనా.. ఇటు కాంగ్రెస్‌పైనా ఆమె విరుచుకుప‌డుతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో.. టంగ్ కూడా స్లిప్ అవుతోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఎవ‌రు?  అంటూ.. ఆమె డైలాగులు పేల్చారు. ఇక‌, రేవంత్‌పైనా ఆమె.. విరుచుకుప‌డ్డారు.

అయితే.. ష‌ర్మిల ఎంత‌గా కామెంట్లు చేసినా.. ఆయా పార్టీల నుంచి రెస్పాన్స్ లేదు. అంటే.. ష‌ర్మిల‌కు.. అటు టీఆర్ ఎస్‌, ఇటు కాంగ్రెస్ నుంచి పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌డం లేదు. ష‌ర్మిల గురించి తాము మాట్లాడి ఆమెను హీరో చేయ‌డం వీరికి ఇష్టం లేన‌ట్టుగా ఉంద‌నే విష‌యం హ‌ల్‌చ‌ల్‌చేస్తోంది. దీనికి కూడా ఒక రీజ‌న్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక స‌ర్పంచ్ స్థాయి నేత‌ను కూడా ష‌ర్మిల త‌న పార్టీలోకి చేర్చుకోలేక‌పోయారు. పైగా.. త‌న‌కు జంపింగులు అవ‌స‌రం లేద‌ని.. తానే నాయ‌కుల‌ను త‌యారు చేస్తాన‌ని అంటున్నారు. కానీ, ఇప్పుడు ష‌ర్మిల పార్టీలో ఉన్న వారిని గ‌మ‌నిస్తే.. వైసీపీ నుంచి వ‌చ్చిన వారు, కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన వారు క‌నిపిస్తున్నారు.

ష‌ర్మిల తాను గీసుకున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌లోనే ఉండి ఉంటే.. రాఘవ‌రెడ్డి వైసీపీ నుంచి, ఇందిరా శోభ‌న్ కాంగ్రెస్ నుంచి, రామిరెడ్డి వైసీపీ నుంచి ఎందుకు తీసుకున్న‌ట్టు? అదేస‌మ‌యంలో సోమ‌న్న‌ను రేవంత్ వ‌ర్గంగా ఉన్నప్ప‌టికీ .. ఎందుకు చేర్చుకున్న‌ట్టు అనేవి కీల‌క ప్ర‌శ్న‌లు. మాట‌లు ఒక‌ర‌కంగా.. చేత‌లు మ‌రోర‌కంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  ఏదైనా చెప్పే ముందు.. అవి చేత‌ల్లో ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌నే విష‌యాన్ని ష‌ర్మిల ఆలోచించ‌డం లేదు. సాధ్యం కాని స్టేట్‌మెంట్లు ఇస్తే.. ఎవ‌రు మాత్రం ష‌ర్మిల‌ను న‌మ్ముతార‌నే ప్ర‌శ్న వ‌స్తోంది.

ఇలానే ఆమె వ్య‌వ‌హ‌రిస్తే.. ఏ ఒక్క‌రూ ష‌ర్మిల పార్టీలో చేరే అవ‌కాశం లేదు. ఇదే జ‌రిగింతే.. క‌నీసం డిపాజిట్లు కూడా రావు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు పేర్కొంటున్నారు మీమ్స్‌, స‌టైర్ల‌తో ముంచెత్తుతున్నారు. మ‌రికొంద‌రు ష‌ర్మిల మాట‌లు.. ప‌రిణితిగా లేవ‌ని.. గ‌ర్విష్టిగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఇదే త‌ర‌హాలో ఆమె వ్య‌వ‌హ‌రిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అంటే.. రెండేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.  

Tags:    

Similar News