అమ్మకానికి టీటీడీ ఆస్తులపై క్లారిటీ ఇదే!

Update: 2020-05-24 03:30 GMT
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్న తిరుమలేషుడిని భక్తులు ఇష్ట దైవంగా భావిస్తారు. ఆయన ఆస్తులు - ఆభరణాలు విలువైనవిగా చూస్తారు. అయితే తాజాగా టీటీడీ ఆస్తుల విక్రయం అనగానే భారీగా దుమారం రేగింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై టీటీడీపై - ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)కి చెందిన ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులు ఏమాత్రం ఉపయోగపడనివని.. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయం తీసుకున్నామని..టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లలో ఈ విషయానికి సంబంధించి అవాస్తవ సమాచారంతో భక్తుల్లో గందరగోళం ఏర్పడిందని.. వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయని తెలిపారు.

జీవో నంబర్ 311 రెవెన్యూ ఎండోమెట్స్ ద్వారా టీటీడీకి మేలు కలిగే అవకాశం ఉంటే దేవస్థానం ఆస్తులను విక్రయించడం.. లీజుకు ఇవ్వడం వంటి అధికారాలు బోర్డుకు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బోర్డు నిర్ణయానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే 1974లోనూ టీటీడీ ఆస్తుల విక్రయం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ వేలం ద్వారా అమ్మారన్నారు. ప్రస్తుతం ఒక సబ్ కమిటీ నియమించి 50 ఆస్తులను వేలం ద్వారా విక్రయించడానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో గల 17 ఆస్తులు.. పట్టణ ప్రాంతంలోని 9 ఆస్తులు.. తమిళనాడు రాస్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 23 ఆస్తులను అమ్మనున్నట్టు తెలిపారు. దురాక్రమణకు గురికాకుండా వేలం వేస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

   
   
   

Tags:    

Similar News