జ‌గ‌న్‌కు 'జీరో రిజ‌ల్ట్‌'.. ఏం జ‌రిగిందంటే!

Update: 2022-04-17 00:30 GMT
ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఒక ప్ర‌శ్న తీవ్రంగా వేధిస్తోంది. అంతేకాదు.. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఎన్నో ఆశ‌ల‌తో తీసుకున్న నిర్ణ‌యం.. సంచ‌ల‌నం అవుతుంద‌ని అనుకున్నా.. చ‌ప్ప‌బ‌డిపోయింది. అదే కొత్త జిల్లాల ఏర్పాటు. "సార్ ఈ ఏర్పాటుతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందా?"అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. నేత‌లు మౌనంగా ఉంటున్నారు. అంతేకాదు.. పెద‌వి కూడా విరు్స్తున్నారు.

జిల్లాల ఏర్పాటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న వైసీపీ స‌ర్కారు.. దీనికి భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. మౌలిక స‌దుపాయాల‌ను త‌క్ష‌ణం ఏర్పాటు చేయాల్సిన అవ స‌రం ఉంటుంద‌ని తెలిసి కూడా.. జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. అయితే... దీని నుంచి వైసీపీ ఆశిస్తున్న లాభం ఏంటి?  ఆ మేర‌కు ల‌బ్ధి చేకూరుతుందా? అనేది నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపై ఎవ‌రూ నిర్దిష్ట‌మైన స‌మాధానం చెప్ప‌డం లేదు. అంతేకాదు.. ఎవ‌రికి వారు మౌనంగా ఉంటున్నారు.

వాస్త‌వానికి జిల్లాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఓటింగ్ మారుతుంద‌ని... సామాజిక వ‌ర్గాల వారీగా.. త‌మ‌కు మ‌ద్ద తు పెరుగుతుంద‌ని.. వైసీపీ ఆశించింది. దాదాపు 43 ఏళ్ల త‌ర్వాత‌..తాము రికార్డు స్థాయిలో జిల్లాల‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్ప‌డం వెనుక కూడా.. ఇన్నాళ్లుగాలేని అభివృద్ధి ఇప్పుడు సాధ్య‌మ‌వు తుంద‌ని వైసీపీ భావించింది. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు త‌మ‌కు అనుచిత ల‌బ్ధిని చేకూరుస్తుంద‌ని నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు.. పార్టీ అధిష్టానం కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రిన్ని అసెంబ్లీ స్థానాలు త‌మ ఖాతాలో ప‌డ‌తాయ‌ని భావిస్తోంది.

నిజంగానే.. జిల్లాల విభ‌జ‌న త‌ర్వాత‌.. వైసీపీ గ్రాఫ్ పెరిగిందా? అంటే..  మెజారిటీ జిల్లాల్లో  ప‌రిస్థితి భిన్నంగా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు.. అసలు జిల్లాల ఏర్పాటు పై స్పందించ‌లేదు. అంతేకాదు... జిల్లాల ఏర్పాటు కార్య‌క్ర‌మానికి కూడా రాలేదు.  ఈ నేప‌థ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆశించిన మేర‌కు ఫ‌లితం అయితే ఇవ్వ‌లేదు. అయితే.. జిల్లాల ఏర్పాటు విష‌యంలో చిన్న పాటి మార్పులు చేస్తే.. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు విలువ ఇస్తే.. అనుకున్న మైలేజీ సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని... పార్టీ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు.

జిల్లాల్లో కొన్ని చోట్ల పేర్లు మార్చాలని.. ఎస్సీ వ‌ర్గాల నుంచి డిమాండ్ లు వినిపించాయి. ప‌ల్నాడుకు గుర్రం జాషువా పేరు పెట్టాలని.. కాకినాడ జిల్లాకు.. బీఆర్ అంబేడ్క‌ర్ పేరు పెట్టాల‌ని.. క‌ర్నూలుకు.. దామోద‌రం సంజీవ‌య్య పేరు పెట్టాల‌ని డిమాండ్లు వ‌చ్చాయి. వీరంతా ఎస్సీ నేత‌లే. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ఆ దిశ‌గా ప్ర‌జ‌ల మాట‌ను ఎక్క‌డా ల‌క్ష్య పెట్ట‌లేదు.

దీంతో జిల్లాలు ఏర్పాటైనా.. దాని తాలూకు.. ఫ‌లితం మాత్రం వైసీపీకి చేర‌లేదు. అంతేకాదు.. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు కూడా జిల్లాల ఏర్పాటుపై స్పందించ‌డం లేదు. ఎందుకంటే.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన డిమాండ్ల‌ను హైక‌మాండ్ ప‌ట్టించుకోలేదు కాబ‌ట్టి. దీంతో త‌మ‌కు ఎక్క‌డ సెగ‌త‌గులుతుందో అని .. నాయ‌కులు మౌనంగా ఉన్నారు. మొత్తానికి జిల్లాల ఏర్పాటు జీరో ఫ‌లితం ఇచ్చింద‌ని గుసుగుస వినిపిస్తోంది.
Tags:    

Similar News