జోహ్రా... నీ క‌న్నీరు వృథా కాదు!

Update: 2017-08-30 10:33 GMT
దేశ భ‌ద్ర‌త కోసం స‌రిహ‌ద్దుల్లో ర‌క్తం చిందించిన సైనికుని కుమార్తెకు దేశం న‌లుచెమూల‌ల నుంచి అందుతున్న భ‌రోసాలివి! ముఖ్యంగా సైనికులు ఈ పాప‌ను చూసి ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్నారు.  గత వారంలో పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 8 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. గ‌త‌ రెండు రోజుల క్రితం సోమవారం నాడు తన రోజువారీ విధి నిర్వహణలో భాగంగా అబ్దుల్ రషీద్ పీర్ అనే జవాను అనంతనాగ్ జిల్లాలోని ఓ మార్కెట్ ప్రాంతానికి వెళ్లగా, ఉగ్రవాదులు దాడి చేసి కాల్చి చంపారు.

మరణించిన అబ్దుల్ రషీద్ కు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు జోహ్రా. తన తండ్రి మరణాన్ని ఆ పాప జీర్ణించుకోల‌కే పోతోంది. తండ్రి శ‌వ‌పేటిక‌పై ప‌డి భోరున విల‌పిస్తోంది. దీనిని చూసిన సైనికులు సైతం త‌మ ధైర్యాన్ని కోల్పోయి క‌న్నీరు పెడుతున్నారు. "మా నాన్న ఏ తప్పూ చేయలేదు. ఆయన్ను ఎందుకు చంపారు? నాన్నను తలచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆయన్ను హత్య చేసిన వారు శిక్షించబడాలి" అని జోహ్రా  అక్కడికి వచ్చిన అధికారులతో మొర‌పెట్టుకుంది. ఆ బాలిక‌ బాధ‌ను చూసిన సైనికుల‌కు నోట‌మాట రావ‌డం లేదు. దేశానికి ర‌క్ష‌ణ‌గా ఉన్న సైనికుల‌కు ఇంతటి బంధాలు అనుబంధాలు ఉంటాయ‌ని, వారు కూడా సాధార‌ణ మ‌నుషులేన‌ని జోహ్రాను చూశాకైనా ఉగ్ర‌వాదులు మారాలి! అనే వ్యాఖ్య‌లు సైతం అక్క‌డ వినిపించ‌డం గ‌మ‌నార్హం.

ఇక జోహ్రా క‌న్నీటిని తెలుసుకున్న దక్షిణ కాశ్మీర్ పోలీస్ డీఐజీ "నీ కన్నీరు ఎంతో మంది హృదయాలను తాకుతోంది. ప్రతి కన్నీటి చుక్కా ప్రతీకారేచ్ఛను రిగిలిస్తోంది. నీ తండ్రి ఓ నిజమైన పోలీసు అధికారి. డ్యూటీ చేస్తూ త్యాగం చేసిన అమరజీవి. బాధపడకు" అంటూ తన ఫేస్ బుక్ లో పోస్టును పెడుతూ జోహ్రా కన్నీరు కారుస్తున్న ఫోటోను యాడ్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. కాగా, అబ్దుల్ రషీద్ అంత్యక్రియలు బంధుమిత్రులు - సైన్యాధికారుల సమక్షంలో ముగిశాయి. ర‌షీద్‌ పై కాల్పులు జ‌రిపిన ఉగ్ర‌మూక‌ల‌ను మ‌ట్టు బెట్టేందుకు మ‌న సైన్యం స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ముందుకు క‌దులుతోంది.
Tags:    

Similar News