కొంతమంది మన చుట్టూ ఏం జరుగుతోందనే విషయం పట్టించుకోరు. అమ్మాయి కనిపిస్తే చాలు చెలరేగిపోతుంటారు. మైకంలో ఏదేదో చేస్తూ అందరికీ దొరికి పోతుంటారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైన తర్వాత ఇళ్లలో జరిగే తతంగ మంతా ఇతరులు కూడా చూడటం కామన్ గా మారింది. ఫిలిపైన్స్ లోని మనీలాలో ఓ ప్రభుత్వ అధికారి తన సెక్రటరీతో జూమ్ లైవ్ కొనసాగుతుండగానే సెక్స్ లో పాల్గొని అందరికీ అడ్డంగా బుక్కయిపోయారు. ఇద్దరూ ఉద్యోగాలు పోగుట్టుకున్నారు.
జీసన్ ఎస్టిన్ అనే ప్రభుత్వ అధికారి గ్రామ కౌన్సిల్ సభ్యులతో జూమ్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఆ కార్యక్రమానికి ఆయనతో పాటు ఆయన సెక్రటరీ కూడా హాజరైంది. జీసన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత తనతో కలసి ఒంటరిగా ఉన్న తన సెక్రటరీతో శృంగారంలోమునిగిపోయాడు. కొద్ది సేపు తర్వాత సెక్రటరీకి ఎందుకో అనుమానం వచ్చి సిస్టమ్ వైపు చూడగా అది ఇంకా రన్నింగ్ లోనే ఉన్నట్లు అర్థమైంది. వెంటనే ఆమె దానిని ఆపివేసింది. ఆ ప్రభుత్వ అధికారికి కంప్యూటర్ వినియోగంలో అంత అవగాహన లేకపోవడంతో జూమ్ ని సరిగా క్లోజ్ చేయలేకపోయాడు. వీరి రాసలీలను కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అందరూ చూశారు. కొందరు వారు సెక్స్ లో పాల్గొనేటపుడు వీడియో కూడా తీశారు. దానిని వారు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ దృశ్యాలు తెగ వైరల్ అయ్యాయి. చివరికి వారిద్దరి బాగోతం ఉన్నతాధికారుల వరకూ చేరడంతో వారిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు.