లాక్ డౌన్.. కరోనా మహమ్మారి చేయబట్టి పనులున్నీ పక్కనపెట్టి దాదాపు ఐదారు నెలల పాటు జనాలు అంతా ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. నరకం చూశారు. ఇక కరోనా సోకిన వారు దాదాపు 15 రోజుల పాటు ఒకే గదిలో బయటకు రాకుండా చుక్కలు చూశారు.ఇప్పటికీ చాలా దేశాల్లో కరోనా ప్రభావం తగ్గగా.. చైనాలో మాత్రం విస్తరిస్తూనే ఉంది. మనలాగా ఫ్రీగా వదిలేయకుండా అక్కడ కరోనా వైరస్ సోకగానే ఆప్రాంతాన్ని ఇప్పటికీ లాక్ డౌన్ చేసేస్తున్నారు. దీంతో జనాలు అరుపులు, కేకలతో ఒర్రి చస్తున్నారు.
లాక్ డౌన్ అంటేనే చైనా ప్రజలు వద్దు మొర్రో అంటూ అధికారులపై ఫైర్ అవుతున్నారు. ఏ ఏరియాలో ఒక్క కేసు నమోదైనా ఆ ఏరియాను లాక్ డౌన్ పెట్టేస్తున్న తీరుపై అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా లాక్ డౌన్ అనగానే ఒక స్టోర్ లోంచి జనాలు సెక్యూరిటీ సిబ్బందిని తోసేసుకొని మరీ పారిపోయిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
కరోనా మహ్మమారికి పుట్టినిల్లు చైనాలోని వూహాన్. గతేడాది డిసెంబర్లో కరోనా వైరస్ వూహాన్లో ప్రబలింది. అక్కడి నుంచి క్రమంగా ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కొన్నినెలలుగా వుహాన్‌లో లాక్డౌన్ విధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం నమోదు కాలేదు. దీంతో రెండు నెలల తర్వాత ఆంక్షలు ఎత్తివేశారు.
చైనాలోని వూహాన్‌లో వైరస్ బయటపడిన తర్వాత పరిస్థితి దారుణంగా మారింది. జనవరిలో 11మిలియన్ల మందిని లాక్డౌన్ చేశారు. రోడ్లను మూసివేసి, ఫెన్సింగ్ వేసి మరి వైరస్‌ను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే వూహాన్ లో కఠిన లాక్ డౌన్ కు వ్యతిరేకంగా ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంది. ప్రజలు నిర్బంధించడంపై తిరుగుబాటు కూడా చనాలో చేశారు.
కరోనా లాక్ డౌన్ అంటేనే చైనీయులు వణికిపోతున్నారు. తాజాగా ఎంతగా విసిగిపోయారో తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిబెట్ నుంచి షాంగైకి వచ్చిన ఓ బాలుడికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అతడు ఇటీవల ఐకియా స్టోర్ కు రాగా ఆ సమయంలో స్టోర్ లో 400 మంది ఉన్నారు.
దీంతో వైరస్ ట్రేసింగ్ లో భాగంగా స్టోర్ ను లాక్ డౌన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించగానే.. లోపలున్న సిబ్బంది, ప్రజలు సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి మరీ బయటకు పరుగులు తీశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. చైనీయులకు లాక్ డౌన్ అంటే ఎంత భయమో తేటతెల్లమైంది.