ఛాంపియన్లు చిత్తయ్యారు...యాషెస్ ఇంగ్లండ్‌దే
ప్రపంచ ఛాంపియన్లు చిత్తయ్యారు. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సీరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన నాలుగో టెస్టులో ఆపీస్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. ఇన్సింగ్స్ 78 పరుగుల తేడాతో ఆసీస్ ఓడిపోయి 3-1 తేడాతో టెస్ట్ సీరీస్ ను కోల్పోయింది. నాలుగో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిపోవడం విశేషం. 319 పరుగుల విజయలక్ష్యానిగాను ఓవర్ నైట్ స్కోర్ 241/7 పరుగులతో మూడో రోజు ఇన్సింగ్స్ కొనసాగించిన ఆస్ర్టేలియా మరో 12 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది.
గత యాషెస్ సీరీస్ లో తమకు ఎదురైన పరాజయానికి ఇంగ్లండ్ ప్రపంచ ఛాంపియన్ హోదా లో ఉన్న ఆసీస్ ను దారుణంగా చిత్తు చిత్తు చేసి ఘోర అవమానాన్ని మిగిల్చింది. మరో టెస్టు మిగిలి ఉండగానే సీరీస్ కైవసం చేసుకోవడంతో ఇంగ్లండ్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. తొలి ఇన్సింగ్స్ లో 60 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి అత్యంత చెత్త రికార్డును నమోదు చేసిన ఆసీస్ రెండో ఇన్సింగ్స్ లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది.
ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ (64), వోజెస్ (51), రోజర్స్(52) పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్ పతనాన్ని స్టూవర్ట్ బ్రాడ్ శాసిస్తే రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన స్టోక్స్ ఆసీస్ వెన్ను విరిచాడు. తొలి ఇన్సింగ్స్ లో 8 వికెట్లు తీసిన బ్రాడ్ ఈ ఇన్సింగ్స్ లో ఒక వికెట్ పడగొట్టాడు.
స్కోరు వివరాలు:
ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ - 60 ఆల్ అవుట్
ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ - 391/9 డిక్లేర్
ఆసీస్ రెండో ఇన్సింగ్స్ - 253 ఆల్ అవుట్