ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ను రెండేళ్ల పాటు నిషేధించాలని లోధా కమిటీ తీర్పుఇచ్చిన సంగతి తెలిసిందే! అయితే ఈ తీర్పు వల్ల అందరికంటే ప్రధానంగా నష్టపోయేది ధోనీ అనే చెప్పాలి! వ్యక్తిగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గానే కాకుండా ఐపీఎల్ కు అనఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ధోనీకి ఇది చేదువార్తే! ఈ వార్త రాగానే... ధోనీ అంటే ప్రత్యక్షంగా ప్రేమ నటించేవారు, పరోక్షంగా విమర్శించేవారంతా ఉన్నట్లుండి నోటికి పనిచెప్పారు! విశ్లేషకులు, నిపులుణులు అనబడేవారంతా ఉన్నట్లుండి "టార్గెట్ ధోనీ" అనే ప్రాజెక్ట్ చేపట్టారు! ఇంతకూ అసలు ధోనీ చేసిన నేరమేమిటో ఇప్పుడు చుద్దాం...
భారత క్రికెట్ చరిత్రలో ధోనీది ప్రత్యేక స్థానం. అందని ద్రాక్షలా ఉన్న ఎన్నో విజయాలు వాటి తాలూకు రికార్డులు సాధించిపెట్టిన ఘనత ఒక కెప్టెన్ గా ధోనీకి ఎప్పుడూ దక్కుతూనే ఉంటుంది! ప్రపంచ కప్ అయినా, ట్వంటీ ట్వంటీ ప్రపంచ కప్ అయినా... టెస్ట్ సిరీస్ లు అయినా, వండే సిరీస్ లు అయినా... ధోనీ సాధించిన కొత్త విజయాలు, గొప్పవిజయాలు ఎన్నో ఉన్నాయి! ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ కు ఊపు తీసుకురావడంలో కూడా ధోనీ పాత్ర ప్రత్యేకం. ఇందుకు పూర్తిస్థాయిలో బీజం వేసింది మాత్రం 2007 లో టి.20 ప్రపంచ కప్ విజయమనే చెప్పాలి!
నిజంగా ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ నుండి ఏమైనా తప్పు చేశాడా? నిజంగా పలువురు వాదిస్తున్నట్లు, పుకార్లు సృష్టిస్తున్నట్లు.. ధోనీ తప్పు చేసి ఉంటే భయటపెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు! ఇప్పటివరకూ ధోనీపై వచ్చిన విమర్శలు అన్నీ ఊహాగానాలు గానే మిగిలిపోయాయి తప్ప ఎక్కడా నిరూపితం కాలేదు సరికదా... విషయం ఉన్న విమర్శలుగా కూడా మిగలలేదు! అయితే... గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ చెయ్యడం కచ్చితంగా చెన్నై జట్టుకు వచ్చిన ప్రధాన విమర్శ అండ్ ప్రధాన నష్టం అనే చెప్పాలి! అయితే ఇది పూర్తిగా గురునాథ్ విషయం! అంతే కానీ... యజమాని బెట్టింగ్ చేశాడు కాబట్టి ధోనీ నేరస్థుడు అనేలా మాట్లాడటం ఎంత వరకూ కరెక్ట్! అయినా గురునాథ్ చేసింది బెట్టింగే కానీ... ఫిక్సింగ్ కాదు! ఈ విషయం అంతా గుర్తించాలనేది ధోనీ అభిమానుల ఆవేదన!
ఏది ఏమైనా... ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారానికి, ముద్గల్, లోధా కమిటీఇలు ఇచ్చిన నిర్ణయాలని ఆయా జట్టుల్లోని క్రికెటర్లకు ఏమాత్రం సంబందం లేదని అనుకోవాలి!! ఏదిఏమైనా... చెన్నై జట్టు నిషేదానికి ధోనీని నిందించడానికి పొంతన లేదన్నది వాస్తవం అనేవారే ఎక్కువ!!