గుజరాత్ వర్సెస్ హైదరాబాద్... మోహిత్ శర్మ మాయ పనిచేసిన వేళ...!

ఐపీఎల్ 2024లో 12వ మ్యాచ్ ఆదివారం గుజరాత్ టైటన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది.

Update: 2024-03-31 14:58 GMT

ఐపీఎల్ 2024లో 12వ మ్యాచ్ ఆదివారం గుజరాత్ టైటన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ సమయంలో టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ క్రీజ్‌ లోకి వచ్చారు. అత్యంత ఆసక్తికరమైన ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం!

స్లోగా స్టార్ట్ చేసిన సన్ రైజర్స్!:

ఒమర్జాయ్‌ వేసిన తొలి ఓవర్‌ లో సన్ రైజర్స్ కు 11 పరుగులు వచ్చాయి. ఇందులో హెడ్.. రెండు ఫోర్లు బాది 10 పరుగులు సాధించగా.. మయాంక్ అగర్వాల్ ఒక పరుగు సాధించారు. దీంతో ఫస్ట్ ఓవర్ పూర్తయ్యే సరికి సన్ రైజర్స్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 11 పరుగులు.

హైదరాబాద్‌ ఫస్ట్ వికెట్ డౌన్:

కాస్త నిలకడగా ఆడుతున్నారు అని భావిస్తున్న సమయంలో... ఒమర్జాయ్‌ వేసిన ఐదో ఓవర్‌ లో రెండో బంతికి దర్శన్‌ కు క్యాచ్ ఇచ్చిన మయాంక్ అగర్వాల్ (16) ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ చివరి బంతికి ఫోర్ బాదాడు. దీంతో ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి సన్ రైజర్స్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు.

పవర్ ప్లే పూర్తయ్యే నాటికి పరిస్థితి ఇది!:

ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కి వచ్చిన అభిషేక్ శర్మ దూకుడు పెంచాడు. రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్ లో వరుసగా రెండు సిక్స్ లు కొట్టాడు. దీంతో 6 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 56 పరుగులు చేసింది సన్ రైజర్స్.

రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్:

సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలింది. నూర్ అహ్మద్ వేసిన ఏడో ఓవర్ లో ఈ సీజన్ లో ఫుల్ ఫాం లో ఉన్న ట్రావిస్ హెడ్ 19 (14 బంతుల్లో 3 ఫోర్లు) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో 7 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్ రైజర్స్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు.

మూడో వికెట్ డౌన్:

మోహిత్ శర్మ వేసిన 10 ఓవర్‌ లో ఆఖరి బంతికి అభిషేక్ శర్మ ఔటయ్యాడు. అప్పటికి అతడి వ్యక్తిగత స్కోరు 29 (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి సన్ రైజర్స్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 74 పరుగులకు చేరుకుంది!

100 దాటిన సన్ రైజర్స్ స్కోరు!

క్లాసెన్ (21), మార్క్రమ్‌ (16) పరుగులతో కాస్త నిలకడగా ఆడుతుండటంతో... 13 ఓవర్లకు సన్ రైజర్స్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 104 పరుగులకు చేరుకుంది.

ఓ.ఎం.జీ... క్లాసెన్ ఔట్!:

ఈ సిరీస్ లో సూపర్ ఫాం లో ఉన్న క్లాసెన్... గత రెండు మ్యాచ్ లలోనూ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న క్లాసెన్ (24) ఔటయ్యాడు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఒక్కసారిగా సైలంట్ అయిపోయారు. రషీద్ ఖాన్ వేసిన 14 ఓవర్లో క్లాసెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లు పూర్తయ్యే సరికి సన్ రైజర్స్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 109 పరుగులుగా ఉంది.

ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్!:

గుజరాత్ బౌలర్లు గ్యాప్ ఇవ్వడం లేదు. ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన సన్ రైజర్స్ బ్యాటర్స్ ని ముప్పుతిప్పలు పెట్టేస్తున్నారు. ఇందులో భాగంగా... ఉమేష్ యాదవ్ వేసిన 15 ఓవర్లో మార్క్రమ్ (17) ఔటయ్యాడు. దీంతో 15 ఓవర్లు పూరయ్యే సరికి సన్ రైజర్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు.

ముగిసిన హైదరాబాద్‌ బ్యాటింగ్!

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (29), అబ్దుల్ సమద్ (29), క్లాసెన్ (24), షాబాజ్ అహ్మద్‌ (22), ట్రావిస్ హెడ్ (19), మయాంక్ అగర్వాల్ (16), మార్క్రమ్‌ (17) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు తీశాడు.

స్టార్ట్ చేసిన గుజరాత్!:

హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ బరిలోకి దిగింది. ఇందులో భాగంగా... ఓపెనర్లు శుభ్‌ మన్‌ గిల్, వృద్ధీమాన్ సాహా క్రీజులోకి వచ్చారు. భువనేశ్వర్‌ కుమార్ వేసిన తొలి ఓవర్‌ లో ఏడు పరుగులు సాధించారు. ఇదే క్రమంలో రెండో ఓవర్లో 11 పరుగులు, మూడో ఓవర్ లో ఏడు పరుగులు, నాలుగో ఓవర్లో 11 పరుగులు సాధించారు. దీంతో... 4 ఓవర్లు పూరయ్యే సరికి గుజరాత్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 36 కు చేరింది.

గుజరాత్ ఫస్ట్ వికెట్ డౌన్!:

షాబాజ్‌ అహ్మద్‌ వేసిన ఐదో ఓవర్ మొదటి బంతికి వృద్ధీమాన్ సాహా (25) ఔటయ్యాడు. దీంతో 5 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ స్కోరు 45 పరుగులు! ఈ సమయంలో శుభ్‌ మన్ గిల్ (18), సాయి సుదర్శన్ (2) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

కెప్టెన్ గాన్... రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్!:

మయాంక్‌ మర్కండే వేసిన పదో ఓవర్‌ లో తొలి బంతికి శుభ్‌ మన్ గిల్ (36) ఔటయ్యాడు. దీంతో 74 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయినట్లయ్యింది. ఫలితంగా... 10 ఓవర్లు పూర్తయ్యేసరికి గుజరాత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.

గుజరాత్ స్కోరు 100 దాటింది:

163 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ స్కోరు 100 దాటింది. దీంతో 14 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది గుజరాత్. ఈ సమయంలో సుదర్శన్ (36), డేవిడ్ మిల్లర్ (10) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

గుజరాత్ మూడో వికెట్ డౌన్:

గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడు మీదున్న సాయి సుదర్శన్ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. కమిన్స్ వేసిన 17 ఓవర్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాయి సుదర్శన్ వ్యక్తిగత స్కోరు 45 (36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్). దీంతో 17 ఓవర్లకు గుజరాత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు.

ఐదు బంతులు మిగిలుండగానే...!

హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నిర్ధేశించిన టార్గెట్ 163 పరుగులను కేవలం 3 వికెట్లు కోల్పోయి.. ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

Tags:    

Similar News