"హలో, ఐజాక్ న్యూటన్"... విరాట్ వీడియో వైరల్!

ఇందులో భాగంగా తాజాగా విరాట్ కొహ్లీ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ పై తనదైన శైలిలో స్పందించారు.

Update: 2024-01-18 13:45 GMT

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మ‌హీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. ఆన్ లైన్ లో ఆయనకు పంచుకోవాలని అనిపించిన ప్రతీ విషయాన్ని ఆయన నెటిజన్లతో పంచుకుంటారు! ప్రధానంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై ఎక్కువగా స్పందించే ఆయన.. పలు సందర్భాల్లో మరింత ఆసక్తికర విషయాలపై మరింత ఆసక్తికరంగా స్పందిస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా విరాట్ కొహ్లీ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ పై తనదైన శైలిలో స్పందించారు.

అవును... బెంగ‌ళూరు వేదిక‌గా బుధ‌వారం రాత్రి భార‌త్‌ - అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టీ.20 మూడో మ్యాచ్ అభిమానుల‌ను ఫుల్ థ్రిల్ కి గురిచేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా చివరి బంతివరకూ టెన్షన్ గా నడిచిందని చెప్పుకునే చోట... మ్యాచ్ అయిపోయిన తర్వాత రెండో ఓవర్ నాలుగోబంతివరకూ విజ‌యం ఇరు జ‌ట్లతో దోబూచులాడిన అరుదైన ఘటన ఆ మ్యాచ్ లో జరిగింది.

ఈ మ్యాచ్ లో ఇరు జట్ల స్కోర్లు స‌మం అవ్వడంతో చివ‌ర‌కు రెండో సూప‌ర్ ఓవ‌ర్ ద్వారా భార‌త్ కు విజయం దక్కింది. ఈ మ్యాచ్‌ లో బ్యాట‌ర్‌ గా కోహ్లీ విఫ‌ల‌మైన‌ప్పటికీ.. ఫీల్డింగ్ లో అద్భుత విన్యాశాలు చేశాడు. ఇందులో భాగంగా... బౌండ‌రీ లైన్ వ‌ద్ద బంతిని సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకోవ‌డంతో పాటు ఓ అద్భుత ర‌న్నింగ్ క్యాచ్‌ ను అందుకున్నాడు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇందులో ప్రధానంగా... అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌ లోని నాలుగో బంతిని క‌రీం జ‌న‌త్ భారీ షాట్ ఆడాడు. ఇందులో భాగంగా బంతిని మిడ్ వికెట్ వైపు సిక్సర్ వెళ్లేలా షాట్ ఆడాడు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న కొహ్లీ... గాల్లోకి ఎగిరి సిక్స్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో ఆరు ప‌రుగులు వ‌స్తాయ‌నుకున్న చోట అఫ్గాన్ సింగిల్‌ తో స‌రిపెట్టుకుంది. ఈ సమయంలో ఒక్కసారిగా మైదానం మారుమ్రోగిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మ‌హీంద్రా ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... కోహ్లీ బంతిని ఆపే ఫోటోను షేర్ చేస్తూ.. "హలో ఐజాక్ న్యూటన్? ఈ గురుత్వాకర్షణ వ్యతిరేక విషయానికి సంబంధించి భౌతికశాస్త్రంలో కొత్త నియమాన్ని నిర్వచించడంలో మీరు మాకు సహాయం చేయగలరా??" అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ కూడా వైరల్ గా మారింది.

Tags:    

Similar News