11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కొత్త చాంపియన్ ను చూస్తామా..? అది ఆర్సీబీనేనా?

అప్పుడెప్పుడో 2014లో.. కోల్ కతా నైట్ రైడర్స్ కొత్త చాంపియన్ గా ఆవిర్భవించింది.. ఇదేం లెక్క? అనుకుంటున్నారా? దీనికో పద్ధతి ఉంది. అదేంటంటే..?;

Update: 2025-03-22 10:25 GMT
IPL New Champion In 2025

ఇప్పటివరకు జరిగిన 17 సీజన్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో.. అప్పుడెప్పుడో 2014లో.. కోల్ కతా నైట్ రైడర్స్ కొత్త చాంపియన్ గా ఆవిర్భవించింది.. ఇదేం లెక్క? అనుకుంటున్నారా? దీనికో పద్ధతి ఉంది. అదేంటంటే..?

-2008 తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్. మొదటి సీజన్ కాబట్టి కొత్త చాంపియన్ అనే పదం ఉండదు.

-2009లో మాత్రం రాజస్థాన్ గెలవలేదు కాబట్టి దక్కన్ చార్జర్స్ కొత్త చాంపియన్ కిందనే లెక్క.

-2010లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) టైటిల్ కొట్టి కొత్త చాంపియన్ అయింది. 2011లోనూ నెగ్గి టైటిల్ నిలపుకొన్న తొలి జట్టుగా రికార్డులకెక్కింది.

-2012లో కోల్ కతా నైట్ రైడర్స్, 2013లో ముంబై ఇండియన్స్ ‘కొత్త చాంపియన్’లుగా నిలిచాయి.

-ఇక ఆ తర్వాత చెన్నై, ముంబై మధ్యనే టైటిల్స్ పంపకం జరిగింది.

-ఏడాది గ్యాప్ తర్వాత 2014లో కోల్ కతా మరోసారి చాంపియన్ గా నిలిచింది.

-2016లో మాత్రం మాజీ దక్కన్ చార్జర్స్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధించింది.

-2022లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్ అయినా.. అది పూర్తిగా కొత్త జట్టే కాబట్టి కొత్త చాంపియన్ అనలేం..

మరి ఈసారి కొత్త చాంపియన్?

17 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఐదేసిసార్లు, కోల్‌ కతా మూడుసార్లు, సన్‌ రైజర్స్‌ (దక్కన్ చార్జర్స్) రెండుసార్లు టైటిల్‌ కొట్టాయి. రాజస్థాన్, గుజరాత్‌ ఒక్కోసారి కప్పు గెలిచాయి.

ఐపీఎల్ లో మొదటినుంచీ ఉన్న బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్ డెవిల్స్), పంజాబ్‌ కింగ్స్ మాత్రమే ఒక్కసారి కూడా చాంపియన్స్ కాలేదు. గుజరాత్‌ తో పాటు మూడేళ్ల కిందట లీగ్‌ లోకి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా టైటిల్ సాధించలేదు.

-మరి 2025లో అయినా కొత్త విజేతను చూస్తామా..? లేక ఇప్పటికే చాంపియన్ అయిన జట్లలోనే ఒకటి టైటిల్ కొడుతుందా? అన్నది చూడాలి. మరీ ముఖ్యంగా హాట్ ఫేవరెట్ సన్‌ రైజర్స్‌ సంగతేమిటి? అనేది చూడాలి.

Tags:    

Similar News