బుల్లితెర నటితో క్రికెటర్ డేటింగ్‌లో వాస్తవం?
తనపై వస్తున్న అన్ని పుకార్లకు ముగింపు పలుకుతూ సిరాజ్ ఇప్పటికే ఇవన్నీ నిరాధార వార్తలు, అవాస్తవాలు అని ఖండించారు;
క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. ప్రముఖ బుల్లితెర నటి మహిరా శర్మతో డేటింగ్ గురించి పుకార్లు వేడెక్కిస్తుండగా, దీనిపై ఇప్పుడు మహిరా శర్మ స్పందించారు. తనపై వస్తున్న అన్ని పుకార్లకు ముగింపు పలుకుతూ సిరాజ్ ఇప్పటికే ఇవన్నీ నిరాధార వార్తలు, అవాస్తవాలు అని ఖండించారు. తనను ఇలాంటి ప్రశ్నలతో విసిగించవద్దని, ఇతరులతో లింక్ చేయడం మానేయమని అతడు అభ్యర్థించారు.
మహిరా శర్మ కూడా డేటింగ్ పుకార్లను తోసిపుచ్చుతూ ఇన్ స్టాలో ఒక నోట్ రాశారు. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, పుకార్లు పుట్టించడం వెంటనే మానేయాలని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో మీరు ఇష్టపడే జట్టు ఏదీ? అంటూ ఫోటోగ్రాఫర్లు మహిరాను ఇదివరకూ ఆటపట్టించారు. కానీ మరుసటి రోజు మీడియా ఇంటరాక్షన్ లో మహిరా స్వయంగా సిరాజ్ తో డేటింగ్ ప్రచారాన్ని కొట్టి పారేసారు.
అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌తో డేటింగ్ వార్తల గురించి మహీరాను ప్రశ్నించగా, నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు అని మహిరా చెప్పింది. లింక్ అప్‌లు అభిమానుల్లో అనుమానాలకు తావిస్తాయని, అలాంటి ఊహాగానాలకు తాను పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వనని అన్నారు. అభిమానులు మనల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. వారిని ఆపలేం. నా సహనటులతోను లింక్ చేస్తారు. తర్వాత కరెక్షన్స్ చేస్తారు. కానీ నేను వీటన్నింటికీ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను. మీకు ఇలాంటి ప్రచారం నచ్చితే చేస్కోండి. కానీ ఇవేవీ నిజాలు కావు`` అని చెప్పింది.
సిరాజ్-మహిరా జంట ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారని, డేటింగ్ లోనే ఉన్నారని గతంలో ఈటైమ్స్ లో కథనాలొచ్చాయి. అయితే ఆ తర్వాత ఇది పూర్తిగా అబద్ధం అంటూ మహిరా తల్లి ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజలు ఏదైనా చెబుతారు. ఇప్పుడు నా కూతురు సెలబ్రిటీ కాబట్టి తన పేరును ఎవరితోనైనా లింక్ చేస్తారు. కాబట్టి మనం వాటిని నమ్మాలా? అని ప్రశ్నించారు.