బిజినెస్ మేనేజ్మెంట్ కోసం వచ్చిన భాగ్యశ్రీ...!
కింగ్డమ్ హిట్ అయితే భాగ్యశ్రీ టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.;
గత ఏడాది రవితేజతో కలిసి 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భాగ్యశ్రీ బోర్సే మంచి గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్‌లో మొదటి సినిమా ఫ్లాప్ అయినా అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్‌కి మరో మంచి హీరోయిన్ దొరికింది అనిపించుకుంది. మిస్టర్ బచ్చన్ ఫలితంతో సంబంధం లేకుండా ఏకంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు జోడీగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను చేసే అవకాశం దక్కించుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'కింగ్డమ్' సినిమాతో భాగ్యశ్రీ బోర్సే మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. కింగ్డమ్ హిట్ అయితే భాగ్యశ్రీ టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.
మహారాష్ట్రలో పుట్టిన భాగ్యశ్రీ బోర్సే చిన్న వయసులోనే ఫ్యామిలీతో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్లింది. నైజీరియాలోని లాగోస్‌లో భాగ్యశ్రీ చదువుకుంది. బిజినెస్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఇండియాకు వచ్చిన భాగ్యశ్రీ బోర్సే మోడలింగ్‌పై ఆసక్తిని కనబర్చింది. పలు యాడ్‌లలో నటించిన భాగ్యశ్రీకి డైరీ మిల్క్ చాక్లెట్ యాడ్ మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ యాడ్‌తో వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అక్కడ నుంచి టాలీవుడ్‌లో ఈ అమ్మడు అడుగు పెట్టింది. మొత్తానికి బిజినెస్ మేనేజ్మెంట్ చేసేందుకు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన భాగ్యశ్రీ బోర్సే మోడలింగ్‌పై ఆసక్తితో యాడ్స్‌లో నటించి, అటు నుంచి ఏకంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
హరీష్ శంకర్ ఈమెను ఒక యాడ్‌లో చూసి రవితేజకు జోడీగా నటింపజేశాడని సమాచారం. రవితేజ సరసన నటించడంతో మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ, ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఎక్కువ ఆఫర్లు రాలేదు. అయితే విజయ్ దేవరకొండతో ఈమె కలిసి నటిస్తున్న కింగ్డమ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇటీవల విడుదలైన టీజర్ చెప్పకనే చెబుతోంది. కింగ్డమ్ సినిమా కనుక సూపర్ హిట్ అయితే కచ్చితంగా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ భాగ్యశ్రీ బోర్సే బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. కింగ్డమ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎంట్రీ ఇస్తారు. అంతకు ముందు అవకాశాల కోసం చాలా కష్టాలు పడుతారు. కానీ భాగ్యశ్రీ మాత్రం అనూహ్యంగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బిజినెస్ మేనేజ్మెంట్ కోసం ఇండియాకు వచ్చిన భాగ్యశ్రీ మోడలింగ్‌పై ఆసక్తిని కనబర్చడం, ఆ తర్వాత సినిమాల్లో పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం అదృష్టం గా భావించవచ్చు. అదే అదృష్టంతో కింగ్డమ్ హిట్ అయితే భాగ్యశ్రీ భాగ్యరేఖ మారినట్లే అనే అభిప్రాయంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. భాగ్యశ్రీ ముందు ముందు టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆమె అందాన్ని అభిమానించే వారు అంటున్నారు.