ఆర్య 2 కి ఆ టైటిల్ అయితే బాగుండేదా..!

ఐతే కొందరు ఈ టైటిల్ విషయంలో చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తే మరికొందరు మాత్రం ఏదో ఒక టైటిల్ కదా అని పెట్టేస్తారు.;

Update: 2025-03-22 18:49 GMT

ఒక సినిమాకు టైటిల్ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. కొన్ని సినిమాలు టైటిల్ వల్లే ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదనే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే సినిమాకు టైటిలే చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఐతే కొందరు ఈ టైటిల్ విషయంలో చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తే మరికొందరు మాత్రం ఏదో ఒక టైటిల్ కదా అని పెట్టేస్తారు. ఐతే కొన్ని సినిమాలు కథలు కొనసాగించకపోయినా టైటిల్ సీక్వెల్ గా సినిమాలు చేస్తుంటారు.

అలా వచ్చిన సినిమాల్లో ఆర్య ఒకటి. ఆర్య సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కి మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ రకరకాల సినిమాలు చేసి మళ్లీ ఆర్య 2 తో ఇద్దరు కలిసి పనిచేశారు. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేశారు కాబట్టే ఆర్య 2 అనే టైటిల్ పెట్టారా అంటే అవుననే చెప్పొచ్చు. ఆర్య సినిమాకు ఆర్య 2 కి ఎలాంటి పోలిక ఉండదు.

ఆర్య 2లో ఫ్రెండ్ షిప్ మీద ఎక్కువ తీసుకెళ్లాడు సుకుమార్. ఐతే లేటెస్ట్ గా యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఆర్య 2 తనకు నచ్చిన సీక్వెల్ సినిమాల్లో ఒకటని చెప్పాడు. ఐతే ఆర్య 2 కి ఆయ 2 కి ఆ టైటిల్ కాకుండా మిస్టర్ పర్ఫెక్ట్ అనే టైటిల్ పెడితే బాగుండేదని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే సినిమాలో హీరో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటాడు.

ఐతే సుకుమార్ మాత్రం ఆర్య కాంబో కాబట్టి అందులోనూ ఇది కూడా ప్రేమకథ కాబట్టి ఆర్య 2 అని పెట్టాడు. ఐతే కళ్యాణ్ శంకర్ చెప్పినట్టుగా నిజంగానే ఆర్య 2 కి మిస్టర్ పర్ఫెక్ట్ అని టైటిల్ పెడితే రిజల్ట్ బాగునేడా ఏమో చెప్పలేం అని ఆడియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా కొన్ని సినిమాలు కథను కొనసాగిస్తూ సీక్వెల్ చేస్తుంటే.. మరికొన్ని సినిమాలు మొదటి సినిమా హిట్ అయ్యిందని అదే టైటిల్ తో సీక్వెల్స్ లాగిస్తున్నారు. ఐతే ఇలా వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా ఆ కథకు కొనసాగింపు కాకుండా వెరే కథతోనే వస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News