తనయుడి ప్లాప్ చిత్రంపై తండ్రి ఏమన్నాడంటే!
అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్- శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ జంటగా నటించిన `లవ్యాపా` ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.;
అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్- శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ జంటగా నటించిన `లవ్యాపా` ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తేలి పోయింది. కేవలం 8 కోట్ల వసూళ్లతో ముగించాల్సి వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ చూస్తే భారీగానే వెచ్చించారు. అద్వైత్ చందన్ తెరకెక్కించిన ఈ సినిమాని దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ -ఫాంటమ్ స్టూడియోస్ నిర్మించాయి.
తాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి అమీర్ ఖాన్ స్పందించారు. `జునైద్ ఇంకా నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఓ రకంగా సినిమా పోయినందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే విజయాల కంటే పరాజయాల నుంచే ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పు ఎక్కడ జరిగిందో సమగ్రంగా తెలుసుకొచ్చు. తప్పులను సరిద్దిద్దుకుని భవిష్యత్ లో వాటిని పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.
జునైద్ ఇప్పుడా పనిలో ఉన్నాడనుకుంటున్నాను. జునైద్ ను చూసి నేను కూడా నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి` అని అమీర్ ఖాన్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. జునైద్ ఖాన్ గత ఏడాది `మహారజ్` చిత్రంలో నటించాడు. అదే అతడి తొలి చిత్రం. అంతకు ముందు అమీర్ ఖాన్ నటించిన `పీకే` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేసాడు.
ప్రస్తుతం జునైద్ ఖాన్ హీరోగా `ఏక్ దిన్` సినిమా తెరకెక్కుతోంది. సునీల్ పాండే తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం గురించి ఇంకా మేకర్స్ పెద్దగా ప్రచారం చేయలేదు. ఇదే ఏడాది రిలీజ్ అవుతుందని సమాచారం.