సహనటితో డీప్ లిప్ లాక్..ఇది ముందే తెలుసు
అయితే ఓటీటీల్లో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది. పెద్ద తెరపై నటీనటులు చేయలేని కొన్ని పనులను ప్రయత్నించడానికి ఓటీటీ ల్లో ఆస్కారం ఉంది.;
ఓటీటీల్లో బోల్డ్ కంటెంట్ ని వండి వార్చడం రొటీనే కానీ, ఇలాంటి డిజిటల్ వేదికల కోసం కొన్ని హద్దు మీరే సన్నివేశాల్లో నటించాలంటే ట్రెడిషనల్ నటీమణులకు కొన్ని అభ్యంతరాలుంటాయి. మాస్టర్‌బేషన్, లెస్బియన్ కిస్సింగ్ సీన్, బెడ్ రూమ్ లో అనుచితమైన సన్నివేశాలను కూడా ఓటీటీల కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా తారలు చేయాల్సి వచ్చింది.
అయితే ఓటీటీల్లో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది. పెద్ద తెరపై నటీనటులు చేయలేని కొన్ని పనులను ప్రయత్నించడానికి ఓటీటీ ల్లో ఆస్కారం ఉంది. రాధికా ఆప్టే, రిచా చద్దా వంటి నటీమణులు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సైట్‌లలో ఇలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. తమన్నా, టబు లాంటి మేటి కథానాయికలు సైతం బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించారు. తమన్నా- విజయ్ వర్మ ఓటీటీ సిరీస్ కోసం హద్దు దాటారు. నవాజుద్దీన్, ఇతర పాత్రధారులు సేక్రెడ్ గేమ్స్ కోసం పరిధులు దాటారు.
అయితే సౌతిండియన్ సాంప్రదాయాలను అనుసరించే నిత్యామీనన్ ఇంతకుముందు `బ్రీత్ 2` వెబ్ సిరీస్ కోసం ఘాటైన శృంగార సన్నివేశానికి అంగీకరించడం ఆశ్చర్యపరిచింది. ఇది లెస్బియన్ కిస్. ఒక మహిళ ఇంకో మహిళను డీప్ గా కిస్ చేయడం.. నిత్యా తన సహనటి నటి శ్రుతి బాప్నాతో లిప్ లాక్ వేసింది. ఆ సన్నివేశంలో నిత్యా ఆమెతో సన్నిహితంగా ఉండటం.. ట్రాప్ లో వేయడం .. చివరకు చంపడం వంటి సన్నివేశాలు రక్తి కట్టించాయి.
నిజానికి అంతకుముందు ఏదైనా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో తన హీరోని నిత్యా డీప్ లిప్ లాక్ వేయలేదు. కానీ ఇలా ఒక అమ్మాయితో ముద్దు లాగించేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అది ఇంటెన్స్ సీన్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిత్యా బాగా తెగించేసింది అంటూ ఘాటు విమర్శలు ఎదురయ్యాయి.
అయితే ఇప్పుడు ఆ ముద్దు సన్నివేశంపై వచ్చిన విమర్శల గురించి నిత్యా స్పందించారు. అప్పుడు ఆ సీన్ గురించి మీడియా రచ్చ చేస్తుందని నాకు తెలుసు! అని వ్యాఖ్యానించారు. మొత్తానికి అన్నీ తెలిసే నిత్యా అలా డేరింగ్ గా ఆ బోల్డ్ సీన్ చేసింది. ప్రస్తుతం నిత్యా తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, ధనుష్ తో మరో సినిమా(ఇడ్లీ కడై) చేస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ సెట్స్ పై ఉన్నాయి.