హీరో-హీరోయిన్: పారే న‌దిలో దూకేంత‌ ధైర్యం?

ప్ర‌స్తుతం యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది.;

Update: 2025-03-24 16:07 GMT

గ‌త కొంత కాలంగా పూజా హెగ్డే టాలీవుడ్ లో న‌ల్ల‌పూసైపోయింది. ఇక్క‌డ అంత‌గా క‌నిపించ‌డం లేదు. అయినా బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. కోలీవుడ్ లోను అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది. ప్ర‌స్తుతం యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. 'హై జవానీ తో ఇష్క్ హోనా హై` అనేది టైటిల్. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ సినిమా రిషికేశ్ షెడ్యూల్‌ను చిత్ర‌బృందం ముగించింది.

వరుణ్ ధావ‌న్ త‌న హీరోయిన్ తో క‌లిసి పారే నదిలోకి దూకుతున్న సరదా వీడియోను తాజాగా అప్‌లోడ్ చేశారు. పూజా చేతిని ప‌ట్టుకుని వ‌రుణ్ ర‌న్ చేయించాడు.. ఆ ఇద్ద‌రూ జోరుగా పారుతున్న నీటిలోకి ఒకే ఒక్క జంప్ చేసారు. నిజంగా ఇది చాలా డేరింగ్ ఫీట్. వ‌రుణ్ కానీ, పూజా కానీ ఎంత‌మాత్రం భ‌య‌ప‌డలేదు. పైగా ఇద్ద‌రూ స‌ర‌దాగా న‌వ్వేస్తూ క‌నిపించారు.

''జావాంజ్ హై తో జంప్ మర్నా హై!! #హై జవానీ తో ఇష్క్ హోనా హై అని క్యాప్ష‌న్ ని జోడించాడు వ‌రుణ్. రిషికేష్ షెడ్యూల్ ముగిసింద‌ని తెలిపాడు. ఈ వీడియో వీక్షించాక చాలా మంది వారి ధైర్యానికి మెచ్యుకోకుండా ఉండ‌లేక‌పోయారు. `వామ్మోవ్! పారే న‌దిలోకి జంట‌గా జంప్!!` అంటూ అభిమానులు కామెంట్ చేసారు. పూజా హెగ్డే ఈ సినిమాతో పాటు అటు త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న జ‌న‌నాయ‌గ‌న్ లో న‌టిస్తోంది. ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్ కూడా ఒక క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా కాస్టింగ్ అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది.

Tags:    

Similar News