డార్లింగ్ ఇంట టేస్ట్ గురించి నిధి అగర్వాల్ కి ఛాన్స్ ఇవ్వదా?
డార్లింగ్ తో పని చేసిన హీరోయిన్లు అయితే ఆకాశమే హద్దుగా పొగిడేస్తుంటారు.;
డార్లింగ్ ప్రభాస్ ని ఇష్ట పడనిది..అభిమానించనది ఎవరు? ఒక్కసారి అతడితో కలిసి పనిచేస్తే అతడేంటో తెలుస్తుంది. అందరికీ నచ్చేస్తాడు. కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్. డార్లింగ్ సింప్లిసిటీ చూసి పెద్ద పెద్ద స్టార్లే ఇలా ఉండటం ఎలా? సాధ్యమంటూ ఎన్నోసార్లు చెప్పారు. ఇక హీరోయిన్ల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్ తో పని చేసిన హీరోయిన్లు అయితే ఆకాశమే హద్దుగా పొగిడేస్తుంటారు.
తనతో పని చేసిన నటీనటులకు పుడ్ తో ప్రేమను పంచడం డార్లింగ్ కి అలవాటు. అలా వాళ్ల మనసుల్లో గొప్ప స్థానం సంపాదించాడు ప్రభాస్. ఇటీవలే మాళవిక మోహనన్ కూడా డార్లింగ్ గురించి ఓ రేంజ్ లో ఎత్తేసింది. సెట్స్ లో ప్రభాస్ ఉండే విధానం..నడచుకునే తీరు..కురిపించే ప్రేమ గురించి పేజీలు పేజీలు మాట్లాడింది. అయినా ఇంకా చెప్పాలి? అనే కోరిక ఇంకా అలాగే ఉంది. ప్రభాస్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.
తన జీవితంలో ప్రభాస్ తో పని చేయడం అన్నది గొప్ప మైలు రాయిగా పోల్చింది. అంతకు ముందు ప్రభాస్ తినిపించిన వంటకాల గురించి చెప్పింది. తాజాగా అతడితో ఆన్ సెట్స్ ఎక్స్ పీరియన్స్ ను పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఇద్దరు జంటగా మారుతి దర్శకత్వం వహిస్తోన్న `రాజా సాబ్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
చిత్రీకరణ క్లైమాక్స్ కు చేరుకుంది. అన్ని పనులు పూర్తి చేసి సమ్మర్ తర్వాత రిలీజ్ అవుతుందని సమాచారం. ఇదే సినిమాలో నిధి అగర్వాల్ కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రిధి కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే మెయిన్ లీడ్ పోషించేది నిధి అగర్వాల్. కానీ ఈ బ్యూటీ ఇంకా ప్రభాస్ వంటకాల గురించి...ఆయన చూపించే అభిమానం గురించి ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. ఆ ఛాన్స్ మాళవిక నిధికి ఇచ్చేలా కనిపించలేదు.