శ్రీలీల బౌలింగ్‌కు ఎవరైనా పడాల్సిందే!
దానికి తగ్గట్టే ఇప్పటివరకు రాబిన్‌హుడ్ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియన్స్ లో సినిమాపై అంచనాలను పెంచేసింది.;
నితిన్ హీరోగా వస్తోన్న తాజా సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నితిన్ , వెంకీ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అవడంతో రాబిన్‌హుడ్ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే ఇప్పటివరకు రాబిన్‌హుడ్ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియన్స్ లో సినిమాపై అంచనాలను పెంచేసింది.
శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఈ మూవీలో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్, ఎస్ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ గెస్ట్ రోల్ లో నటించారు. ఆయనకు సినిమాలంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. అందులోనూ తెలుగు సినిమాలంటే కాస్త ఎక్కువ ఇష్టం.
ఆ ఇష్టంతోనే వార్నర్ తెలుగు సినిమాలోని ఫేమస్ డైలాగ్స్ కు, సాంగ్స్ కు రీల్స్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. వార్నర్ ఇంట్రెస్ట్ ను సరిగ్గా పట్టుకున్న వెంకీ కుడుముల ఆయనతో రాబిన్‌హుడ్ లో ఓ క్యామియో చేయించాడు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా ఆ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్, నితిన్ ను ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చేసింది. రాబిన్‌హుడ్ టీమ్ నుంచి క్రికెట్ టీమ్ ను బిల్డ్ చేయాలంటే ఎవరు దేనికి సూటవుతారో చెప్పమని కోరింది. దానికి నితిన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తమ టీమ్ లో బౌలర్ గా శ్రీలీల ఉండాలని, ఎందుకంటే ఆమె నాజూగ్గా, వయ్యారంగా మెలికలు తిరుగుతూ బౌలింగ్ చేస్తే ఎవరైనా అవుట్ అవాల్సిందే నంటూ శ్రీలీలపై ఫన్నీ కామెంట్స్ చేశాడు నితిన్.
డైరెక్టర్ వెంకీ కుడుముల అంపైర్ అని, వికెట్ కీపర్ గా నిర్మాత రవి శంకర్ ఉండాలని, ఎవరెలా ఉన్నా బ్యాట్స్ మ్యాన్ మాత్రం తానేనని, వారందరికీ ఓనర్ మాత్రం డేవిడ్ వార్నర్ అంటూ నితిన్ రాబిన్‌హుడ్ క్రికెట్ టీమ్ ను అనౌన్స్ చేశాడు. నితిన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.