లెజెండ్ ఆఖరి సినిమా రిలీజ్ డేట్ ఇదే..!

దళపతి విజయ్ చివరి సినిమా అవ్వడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.;

Update: 2025-03-24 16:09 GMT

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించగా ప్రేమలు బ్యూటీ మమితా బైజు కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుంది. దళపతి విజయ్ చివరి సినిమా అవ్వడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.


ఇక లేటేస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ ను 2026 జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. వచ్చే సంక్రాంతికి విజయ్ సినిమా వస్తుంది. పొంగల్ రేసులో దళపతి మూవీ వచ్చేందుకు సిద్ధమైంది


దళపతి విజయ్ ఎన్నో సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్లు కొట్టాయి. ఐతే కెరీర్ లో చివరి సినిమాను కూడా పొంగల్ కి తీసుకొస్తున్నారు. లెజెండ్ దళపతి చివరి సినిమా కాబట్టి కె.వి.ఎన్ ప్రొడక్షన్ ఈ సినిమాను దళపతి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా చేస్తున్నారు. సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదని తెలుస్తుంది.

డైరెక్టర్ వినోద్ కూడా విజయ్ ఆఖరి సినిమా కాబట్టి ఈ సినిమా కొన్నేళ్ల పాటు ఫ్యాన్స్ కి గుర్తుండిపోయేలా చేసేందుకు కృషి చేస్తున్నాడు. దళపతి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. మరి సినిమా ఏమేరకు ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది అన్నది చూడాలి.

దళపతి విజయ్ కూడా తన చివరి సినిమా కాబట్టి ఇదొక ఫ్యాన్ ఫీస్ట్ మూవీగా ఉండేలా చూసుకుంటున్నారట. ఈ సినిమా తర్వాత పూర్తిస్థాయిలో పాలిటిక్స్ మీద ఫోకస్ చేయనున్న విజయ్ సినిమా కెరీర్ కు జన నాయగన్ తో ఒక మంచి సెండ్ ఆఫ్ ఇవ్వనున్నాడు. ఇప్పటికే రిలీజైన జన నాయగన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి దళపతి ఫ్యాన్స్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందిస్తారన్నది చూడాలి. ఐతే జన నాయగన్ సినిమాను ఒక తెలుగు సినిమాకు అఫీషియల్ రీమేక్ అన్న టాక్ ఉంది. దళపతి విజయ్ చివరి సినిమా కాబట్టి ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ ముందుకు తెస్తారా లేదా కేవలం తమిళంలోనే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News