నాకు ఇదేం టార్చర్ అసలు?
సుహాస్ నటించిన కలర్‌ఫోటో సినిమా మంచి సక్సెస్ అవడంతో అతన్ని హీరోగా పెట్టి పలువురు నిర్మాతలు సినిమాలు చేశారు.;
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చిన సుహాస్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్న సుహాస్ కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
సుహాస్ నటించిన కలర్‌ఫోటో సినిమా మంచి సక్సెస్ అవడంతో అతన్ని హీరోగా పెట్టి పలువురు నిర్మాతలు సినిమాలు చేశారు. ప్రస్తుతం సుహాస్ హీరోగా ఓ భామ అయ్యో రామా అనే సినిమాలో నటించాడు. రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటించింది.
తాజాగా ఓ భామ అయ్యో రామా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో సుహాస్ కు మీడియా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. మీరు అడ్వర్టైజ్‌మెంట్‌కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో సినిమాలకు కూడా అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటారని బయట టాక్ ఉంది. దీనికి మీరెలా స్పందిస్తారని ఓ జర్నలిస్టు సుహాస్ ను అడిగారు.
జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అసలు నాకు ఇదేం టార్చర్ అంటూ సుహాస్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. నేననుకున్నంత నెంబర్ అయితే లేదని, అయినా నా యాక్టింగ్ బావుందనో లేక ఇంకేదో చూడకుండా అసలు ఈ రెమ్యూనరేషన్ గోలేంటని అన్నారు. అదే ఈవెంట్ లో ప్రభాస్ హీరోగా నటించనున్న స్పిరిట్ మూవీలో నటిస్తున్నారా అని అడగ్గా అదేమీ లేదని సుహాస్ చెప్పారు.
ఇదిలా ఉంటే గతంలో కూడా సుహాస్ రెమ్యూనరేషన్ విషయంలో మీడియాలో పలు ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. సుహాస్ సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. పెరుగుతున్న ఖర్చుల్లో నేను కూడా బతకాలి కదా.. జూ. ఆర్టిస్ట్ దగ్గర్నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానని అయినా మీడియాలో అనుకున్నంత రెమ్యూనరేషన్ తాను తీసుకోవడం లేదని ఆ వార్తలపై సుహాస్ గతంలో స్పందించిన విషయం తెలిసిందే.