షాంపైన్‌లో మునిగి తేలిన స్టార్ హీరో.. ఇదిగో లైవ్!
అతడి క్యాప్ నిండా షాంపైన్ ని ఒలకబోస్తూ టీమ్ సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు.;
50 పైబడిన వయసులో తళా అజిత్ సాహసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అతడు వందల మైళ్ల వేగంతో సూపర్ కార్ ని నడపగలడు. అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీల్లో ట్రోఫీలు గెలుచుకుంటూ షాక్‌లిస్తున్నాడు. ఇటలీలో జరిగిన ముగెల్లో 12H రేసులో అజిత్ కుమార్, అతడి టీమ్ ఘనవిజయం సాధించాయి. షాంపైన్ షవర్ తో తన టీమ్ సహా అభిమానులతో సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. అతడి క్యాప్ నిండా షాంపైన్ ని ఒలకబోస్తూ టీమ్ సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు.
అజిత్ కుమార్ తన రెండు అభిరుచులను సమాంతరంగా నడిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సినిమాలు, మోటార్ స్పోర్ట్స్ ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. అంతర్జాతీయ సర్క్యూట్ కార్ రేస్ ఈవెంట్‌లో అజిత్ టీమ్ మూడవ స్థానాన్ని సంపాదించగా, సోషల్ మీడియాలో తన మేనేజర్ షేర్ చేసిన గ్లింప్స్ వైరల్ గా మారింది. ఇటలీలో జరిగిన ముగెల్లో 12H రేసుకు సన్మాన కార్యక్రమంలో అజిత్ అతడి రేసింగ్ బృందం ఇతర విజేతలతో పాటు పోడియంపై నిలబడి కనిపించారు. ఈవెంట్ అనంతరం.. షాంపైన్ బాటిల్ తెరిచి తన టీమ్ సభ్యులు, అభిమానులతో భారీ సెలబ్రేషన్ చేసుకున్నాడు.
ప్రస్తుతం తన తదుపరి యాక్షన్ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రిలీజ్ బరిలోకి వస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. టీజర్ ఇప్పటికే విడుదలై వైరల్ గా దూసెకెళ్లింది. సూపర్ స్టార్ అజిత్ మాస్ యాక్షన్ అవతార్ అభిమానుల్లో ఫీవర్ రాజేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ అయినా కానీ, ఈ చిత్రంలో బలమైన భావోద్వేగ సంబంధాన్ని కూడా కలిగి ఉందని, ఇది కేవలం సరళమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ కంటే ఎక్కువగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు, అజిత్ కుమార్ తదుపరి ప్రాజెక్ట్‌లో ధనుష్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రారంభంలో పుకార్లు అని భావించినా కానీ, ఈ వార్తను ఇటీవల నిర్మాత ఆకాష్ బాస్కరన్ ధృవీకరించారు, ఈ చిత్రం ప్రస్తుతం చర్చల దశలో ఉందని ఆయన తెలిపారు.