యంగ్ టైగ‌ర్ హ‌లీమ్ ని క్ష‌మించేదే లేదంటున్నాడే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నాన్ వెజ్ ప్రియుడ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ చికెన్-మ‌ట‌న్ బిర్యానీ అంటే సింగిల్ గా హండీలే లాగించేస్తాడు.;

Update: 2025-03-23 12:52 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నాన్ వెజ్ ప్రియుడ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ చికెన్-మ‌ట‌న్ బిర్యానీ అంటే సింగిల్ గా హండీలే లాగించేస్తాడు. అంతేనా మంచి వంట‌గాడు కూడా. స్నేహితు లొచ్చినా ..చుట్టాలొచ్చినా తానే స్వ‌యంగా బిర్యానీ వండి వ‌డ్డిస్తాడు. ఆదివారం వ‌చ్చిందంటే? వంట గ‌దిలోనే ఉంటాడు. అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ కి ఫోన్ చేసి ఇంటికి ర‌ప్పించుకుని బిర్యానీ రుచి చూపించ‌నిదే ఒప్పుకోడు.

అన్న‌య్య అంటే అంత ప్రేమ ఎన్టీఆర్ కి. ఇక ప్ర‌పంచంలో ర‌క‌ర‌కాల నాన్ వెజ్ వంట‌కాలు అన్నా? అంతే అమితంగా ఇష్ట‌ప‌డ‌తాడు. ప్ర‌స్తుతం రంజాన్ మాసం కావ‌డంతో? ఎన్టీఆర్ హలీమ్ సీక్రెట్ కూడా లీక్ చేసాడు. రంజాన్ మాసం అంటే హైద‌రాబాద్ అంతా హలీమ్ తోనే ఘుమఘుమ‌లాడుతుంది. హలీమ్ కేవ‌లం ఈ ఒక్క సీజ‌న్ లో నే దొరుకుతుంది. కాబ‌ట్టి హలీమ్ రుచి చూడ‌టానికి అంతా ఇష్ట‌ప‌డ‌తారు.

కానీ తార‌క్ మాత్రం హలీమ్ ఎప్పుడు తినాల‌నుకుంటే అప్పుడు తానే స్వ‌యంగా సిద్దం చేసుకుంటాడుట‌. చికెన్ బిర్యానీ ఎంత ఇష్ట‌మో ? అంత‌కంటే ఎక్కువ‌గా హలీమ్ ఇష్టం అంటున్నాడు. హలీమ్ త‌యారు చేయ‌డం అంటే మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తానంటున్నాడు. తాను ఏది వండినా కేవ‌లం ఇంట్లో వాళ్ల కోసం మాత్ర‌మే కాకుండా స్నేహితుల్ని, స‌న్నిహితుల్ని పిలిచి మ‌రీ తిని వెళ్లే వ‌ర‌కూ ఒప్పుకోడుట‌. అదీ తార‌క్ గొప్ప‌త‌నం.

ఇక తార‌క్ సినిమాల విష‌యానికి వ‌స్తే తార‌క్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `డ్రాగ‌న్` తెర‌కె క్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది నీల్ మార్క్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. సీ బ్యాక్ డ్రాప్ లో సాగే డ్రగ్స్ మాఫియా స్టోరీ. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉందీ చిత్రం. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ లో తార‌క్ జాయిన్ అవుతాడు. అలాగే బాలీవుడ్ లో `వార్ 2`లోనూ తార‌క్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News