ఆ దేశంలో ‘కింగ్‌డమ్’ సర్ ప్రైజ్?
టాలీవుడ్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాలకు ఆదరణ పెరుగుతున్న వేళ, విజయ్ దేవరకొండ చేస్తున్న కింగ్‌డమ్ సినిమా చుట్టూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.;
టాలీవుడ్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాలకు ఆదరణ పెరుగుతున్న వేళ, విజయ్ దేవరకొండ చేస్తున్న కింగ్‌డమ్ సినిమా చుట్టూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఫిబ్రవరిలో విడుదలై, ఒక మిస్టరీ వాతావరణాన్ని ప్రేక్షకుల ముందు ఉంచింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోందన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హీట్ పెంచింది.
విజయ్ దేవరకొండ ఈరోజే శ్రీలంకకి వెళ్లనున్నట్టు సమాచారం. తదుపరి షెడ్యూల్‌లో ఓ కీలకమైన సాంగ్ ను అక్కడే షూట్ చేయనున్నారు. మొత్తం ఐదు రోజులపాటు సాగనున్న ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ టూరిజం హాట్‌స్పాట్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది సాధారణ సాంగ్ లొకేషన్ కాకుండా, కథకు కీలకమైన నేపథ్యాన్ని రివీల్ చేసేలా ఉండబోతుందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ 1980లలో జరిగిన శ్రీలంక సివిల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఇందులో ఓ రెబెల్‌గా కనిపించి, ఆర్మీ అణచివేతలకు ఎదురైన ప్రజల కోసం పోరాడే పాత్రలో కనిపించనున్నాడట. ఇందులోని కాస్ట్యూమ్స్, విజువల్స్ కూడా మిలిటరీ యాంగిల్స్‌కు దగ్గరగా ఉండటంతో ఆ ఊహనలకు బలం చేకూరుతోంది.
గౌతమ్ తిన్ననూరి గతంలో జెర్సీ వంటి భావోద్వేగ చిత్రాన్ని అందించిన దర్శకుడు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఇలా విభిన్నమైన యాక్షన్ డ్రామా చేస్తున్నాడు అంటే, కచ్చితంగా కథలో బలమైన కంటెంట్ ఉంటుంది అనటానికి సంకేతం. కానీ సింగిల్ మ్యాన్ అగెనెస్ట్ సిస్టమ్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేసిన విజయ్ పాత్ర మాత్రం ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమాలో గ్లామరస్ నటి భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆమెకు టాలీవుడ్‌లో ఇది పెద్ద బ్రేక్ అవుతుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేసవిలో, మే 30న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక కథానికలో ఉన్న సీరియస్ టోన్, అంతర్జాతీయ బ్యాక్‌డ్రాప్, శక్తివంతమైన పాత్రల డిజైన్.. అన్ని కూడా కింగ్‌డమ్ ను విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత సీరియస్ ప్రాజెక్ట్‌గా నిలిపేలా చేస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూనే ఉంది. ఇప్పుడు శ్రీలంక షూట్ తర్వాత మరో హైప్డ్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండటంతో, ఈ సినిమా వేసవి బాక్సాఫీస్ రేసులో ముందంజలో ఉండేలా కనిపిస్తోంది.