కాళ్లకు చెప్పుల్లేకుండా.. ఆమె డెడికేషన్ అలాంటిది మరి
ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా అలాంటి ప్రశంసలే అందుకుంటుంది.;
కొన్ని సినిమాల కోసం, కొన్ని పాత్రల కోసం నటీనటులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందో రాదో పక్కనపెడితే ఆ కష్టానికి అందరి నుంచి ప్రశంసలు మాత్రం దక్కుతాయి. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా అలాంటి ప్రశంసలే అందుకుంటుంది. టాలీవుడ్ లో తమన్నా చేస్తున్న తాజా చిత్రం ఓదెల2.
అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంపత్ నంది కథ అందిస్తూ నిర్మించారు. ఓదెల రైల్వే స్టేషన్ కు కొనసాగింపుగా వస్తోన్న సినిమా కావడంతో ఓదెల2 పై అందరికీ మంచి అంచనాలున్నాయి. హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీలో తమన్నా నాగసాధువు గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం తమన్నా ఎంతో కష్టపడిందని ఆల్రెడీ రిలీజైన కంటెంట్ చూస్తుంటే అర్థమవుతుంది. ఓదెల2 కోసం తమన్నా ఎంతో బరువైన కాస్ట్యూమ్స్ వేసుకుందని, సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు చెప్పులు కూడా లేకుండా నటించిందని సంపత్ నంది రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తెలిపారు.
భైరవి పాత్రలో తమన్నా చాలా బాగా చేసిందని, ఇంకా చెప్పాలంటే ఆమె ఆ పాత్రలో జీవించిందని, సినిమాలో ఒక సీన్ ను ఎక్కువ ఎండలో తీయాల్సి వచ్చిందని, ఆ టైమ్ లో ఆమె కాళ్ల కింద ఆకులు వేస్తే, తమన్నా వద్దని వాటిని తీయించేసిందట. దీంతో ఆ ఎండలో కాళ్లు కాలి ఆ రాత్రికి తమన్నా అరికాళ్లకు బొబ్బలు వచ్చాయని, తమన్నాకు సినిమాపై ఉన్న డెడికేషన్ అలాంటిదని ఆయన అన్నారు.
ఓదెల2 సినిమా విషయంలో తమన్నా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. భైరవి పాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన తమన్నా, తన కెరీర్లోనే ఎక్కువ ఐ క్లోజప్ షాట్స్ ను ఇందులోనే తీశారని అంటోంది. ఒక పల్లెటూరి కథను ఎంతో థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం ఓదెల2 ద్వారా చేశామని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తమన్నా చెప్తోంది.