ఎస్‌జె సూర్య ఎప్పట్నుంచో ఆ మాట చెప్పేవాడు
ఈ ప్రెస్ మీట్ లో సినిమాలో కీలక పాత్రలో నటించిన ఎస్‌జె సూర్య కూడా పాల్గొన్నాడు.;
చియాన్ విక్రమ్ హీరోగా అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీర ధీర శూర పార్ట్2. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సినిమాలో కీలక పాత్రలో నటించిన ఎస్‌జె సూర్య కూడా పాల్గొన్నాడు.
ఒకప్పుడు డైరెక్టర్ గా పలు సినిమాలు చేసి ఆడియన్స్ తో సూపర్ అనిపించుకున్న ఎస్‌జె సూర్య ఇప్పుడు నటుడిగా మారి నెక్ట్స్ లెవెల్ పాత్రలు ఎంచుకుని ఆ పాత్రల్లో ఒదిగిపోయి ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి సినిమాకు ఎస్‌జె సూర్యనే డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. ఆ సినిమాతో డైరెక్టర్ గా సూర్యకు చాలా మంచి పేరొచ్చింది.
డైరెక్టర్ గా తనకు ఖుషి ఎంత పేరు తెచ్చిపెట్టిందో, నటుడిగా నానితో కలిసి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన సరిపోదా శనివారం సినిమా కూడా అంతేపేరు తెచ్చిపెట్టిందని ఈ రెండు సినిమాలు తెలుగులో తనకు ప్రత్యేక క్రేజ్ ను తెచ్చాయని, ఆడియన్స్ గుండెల్లో చోటుని కల్పించాయని, దానికి తనకెంతో సంతోషంగా ఉందని సూర్య తెలిపారు.
ఇక అదే ఈవెంట్ లో హీరో విక్రమ్ మాట్లాడుతూ తాను, సూర్య కలిసి చెన్నై లయోలా కాలేజ్ లో చదువుకున్నామని, అప్పట్నుంచే వారిద్దరికీ పరిచయముందని తెలిపారు. తాను హీరో అవకముందే సూర్య డైరెక్టర్ అయిపోయాడని, కానీ ఎప్పట్నుంచో సూర్య తనకు యాక్టర్ అవాలనుందని చెప్పేవాడని విక్రమ్ తెలిపారు.
ఒకరోజు చెన్నై లో తాను కార్ లో వెళ్తుండగా మెట్రో దగ్గర ఓ షూటింగ్ జరుగుతుందని, ఏంటని అడిగితే మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ అని తెలిసిందని, అందులో సూర్య విలన్ రోల్ చేస్తున్నాడని తెలిసి చాలా సంతోషించానని విక్రమ్ చెప్పారు. డైరెక్టర్ గా ఎస్‌జె సూర్య తీసిన వాలి సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని విక్రమ్ ఈ సందర్భంగా చెప్పారు.