రూ.800 కోట్ల కలెక్షన్స్‌ మూవీ... ఆ పెద్ద తప్పు చేశాం

అయితే పీకే సినిమా విషయంలో ఆమీర్‌ ఖాన్‌తో పాటు దర్శకుడు రాజ్ కుమార్‌ హిరాణి ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారట.;

Update: 2025-03-22 21:30 GMT
Aamir khan words about pk collections

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌, రాజ్‌ కుమార్‌ హిరాణి కాంబోలో 2009లో '3 ఇడియట్స్‌', 2014లో 'పీకే' సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. బాలీవుడ్‌లో ఆ సమయంలో ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ కలెక్షన్స్ నమోదు చేశాయి. ముఖ్యంగా పీకే సినిమా దాదాపు రూ.800 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. 3 ఇడియట్స్ సినిమాను తమిళ్‌లో విజయ్ హీరోగా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. రీమేక్‌ సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 3 ఇడియట్స్‌ సినిమాతో విద్యా వ్యవస్థ ప్రస్తుత రోజుల్లో ఎలా ఉంది, దాన్ని ఎలా మార్చాలి అనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. ఇక పీకే సినిమాలోను మంచి మెసేజ్‌ను దర్శకుడు రాజ్ కుమార్‌ హిరాణి ఇచ్చాడు. అయితే పీకే సినిమా విషయంలో ఆమీర్‌ ఖాన్‌తో పాటు దర్శకుడు రాజ్ కుమార్‌ హిరాణి ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారట.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమీర్ ఖాన్ ఆ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు. పీకే సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, వర్క్‌కి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ తాను, రాజ్ కుమార్‌ హిరాణి అంతగా సంతోష పడలేదని అన్నాడు. పీకే సినిమా రోజులను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న ఆమీర్ ఖాన్‌ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. పీకే సినిమా కోసం మొదట పూర్తిగా మరో కథను అనుకున్నాం. చిత్రీకరణ మొదలు పెట్టిన తర్వాత మెల్ల మెల్లగా కథను మారుస్తూ వచ్చాం. చివరకు పూర్తి కథను మార్చేయాల్సి వచ్చింది. క్లైమాక్స్‌ను సైతం ముందుగా అనుకున్నట్లుగా కాకుండా మార్చి తీయాల్సి వచ్చిందని ఆమీర్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

ఒకవేళ ముందుగా రాజ్‌ కుమార్‌ హిరాణి చెప్పిన క్లైమాక్స్‌తో సినిమాను షూట్‌ చేసినట్లయితే అప్పటికే వచ్చిన మరో సినిమాను కాపీ చేసినట్లుగా ఉండేది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో క్లైమాక్స్‌ను మార్చాల్సి వచ్చింది. అందుకే సినిమా అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న క్లైమాక్స్ ముందు అనుకున్నట్టుగా తీయలేక పోవడంతో ఇద్దరం ఆనందంగా లేము అని ఆమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. పీకే విషయంలో మేము తీసుకున్న నిర్ణయాలు చాలా పెద్ద తప్పుడు నిర్ణయాలు అని ఇద్దరం పలు సందర్భాల్లో చర్చించుకున్నామని ఆమీర్‌ ఖాన్‌ అన్నాడు. ఆ తప్పులు చేయకుండా ఉంటే సినిమా ఇంతటి పెద్ద హిట్‌ అయ్యేది కాదేమో అనేది కొందరి అభిప్రాయం.

వేరే గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసి భూమి మీద ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, అతడు తిరిగి తన గ్రహంకు వెళ్లే సమయంలో ఎలాంటి భావోద్వేగాలకు లోను అయ్యాడు అనే విషయాలను ఈ సినిమాలో చూపించాడు. కథ చాలా సింపుల్‌గా ఉన్నా దర్శకుడు ఎమోషన్స్‌తో, మంచి మెసేజ్‌తో పాటు, వినోదంతో పీకేను అద్భుతంగా రూపొందించి ఆకట్టుకున్నాడు. పీకే సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అమీర్‌ ఖాన్‌ ఆ సమయంలో ఇండియాలోనే టాప్‌ హీరోగా నిలవడం మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగానూ నిలిచాడు. అయితే పీకే తర్వా మళ్లీ ఆ స్థాయి విజయం ఇండియాలో ఆమీర్‌ ఖాన్‌కి దక్కలేదు. దంగల్‌ వచ్చినప్పటికీ చైనాలోనే ఎక్కువగా ఆ సినిమా వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రాబట్టిన వసూళ్లు పీకే తో పోల్చితే తక్కువే అనేది బాక్సాఫీస్‌ వర్గాల టాక్‌.

Tags:    

Similar News