తనయుడితోనూ అదే ప్రయత్నం ఫలించేనా?
మాలీవుడ్ యంగ్ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ లాల్ అలా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.;
ఇండస్ట్రీలో ఎవరికైనా ఓన్ ఐడెంటిటీ అనేది అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే గానీ సాధ్యం కాదు. తాతలు..తండ్రులు హీరోలైతే? వారసులకు అది ఎంట్రీ కార్డుగానే పరిమితం అవుతుంది. ఆపై ఎవరైనా సొంత ట్యాలెంట్ పైనే ఎదగాల్సిందే. మాలీవుడ్ యంగ్ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ లాల్ అలా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రణవ్ కెరీర్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించాడు.
అటుపై నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆరేళ్ల క్రితం 'ఆది' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇన్నేళ్ల కెరీర్ లో అతడు చేసిన సినిమాలు కేవలం ఐదారు మాత్రమే. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. గత ఏడాది 'వర్షంగళక్కు శేషం' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇది. బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రమిది.
ఆ తర్వాత డాడ్ నటించని 'బరోజ్' చిత్రంలో గెస్ట్ అపిరియన్స్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత ప్రణవ్ లాల్ మళ్లీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ కొత్త ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు. 'బ్రహ్మయుగం' ఫేం సదాశివన్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ లో సినిమా షూటింగ్ కూడా మొదలవుతుందని సమాచారం.
హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందిట. 'బ్రహ్మాయుగం' కూడా హారర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. ఇది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ సినిమా అంతగా కనెక్ట్ కాలేదు. హారర్ ప్రియుల్ని కాస్తో కూస్తో అలరించింది. మళ్లీ సదాశివన్ తనయుడితోనే అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. మరి ఇందులో కొత్తగా ఏం చెప్పబోతున్నాడు? అన్నది చూడాలి.