గేమ్ ఛేంజర్.. దిల్ రాజు కౌంటర్ ఇచ్చే హై బడ్జెట్ కాంబినేషన్స్ ఇవే..

ఈ మూవీని నిర్మించిన నిర్మాత దిల్ రాజు ఎక్కడికి వెళ్లినా దీనిపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.;

Update: 2025-03-22 23:30 GMT

గేమ్ ఛేంజర్ డిజాస్టర్ ఎంత పని చేసిందంటే, కేవలం కమర్షియల్ గా లాస్ తేవడమే కాకుండా ఎక్కడికి వెళ్లినా కూడా దాని తాలూకు ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా 100 కోట్లకు పైగా నష్టాలు తెచ్చినట్లు టాక్. ఇక ఓటీటీ లో వచ్చాక కూడా సోషల్ మీడియాలో అనేక విమర్శలు, చర్చలు నడుస్తున్నాయి. ఈ మూవీని నిర్మించిన నిర్మాత దిల్ రాజు ఎక్కడికి వెళ్లినా దీనిపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా లూసిఫర్ 2 కార్యక్రమంలో కూడా ఇదే చర్చ నిలిచింది.

ఈ సినిమాను ఆయన తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆడిటోరియంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పేరు వినిపించగానే అలజడి రేగింది. దిల్ రాజు కాస్త అసహనంగా స్పందించినా, మీడియా మాత్రం ప్రశ్నించక తప్పలేదు. ఆ సినిమాకు కూడా రామ్ చరణ్, శంకర్ రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ స్టార్ట్ చేసినట్లు చెప్పి అక్కడితో దాన్ని ఫినిష్ చేశారు.

వాస్తవానికి దిల్ రాజు గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. కానీ గేమ్ ఛేంజర్ వంటి భారీ బడ్జెట్ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రశ్నలు ఎక్కువయ్యాయి. దీని ప్రభావం ఆయన మీదే కాదు, నిర్మాణ సంస్థపై కూడా పడింది. అయితే ఈ ఫెయిల్యూర్‌ను పట్టించుకోకుండా దిల్ రాజు మరోసారి బిగ్ కాంబినేషన్లను లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ తదుపరి భారీ చిత్రాల మీదే పెట్టారు.

ఇప్పటికే ప్రశాంత్ నీల్‌తో ఓ బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్టు ప్లాన్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. అలాగే మార్కో దర్శకుడితో మరో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనుందని టాక్. పైగా ప్రభాస్ కోసం గతంలో రేడీ చేసిన ‘జటాయు’ అనే కథను కూడా రీడిజైన్ చేయిస్తున్నారు. బడ్జెట్ ను పెంచి రాబోయే రోజుల్లో సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ కూడా రాజుగారికి ఇప్పటికే మాట ఇచ్చారు. ఇక రాబోయే పెద్ద సినిమాలన్నీ 250 కోట్లు, 300 కోట్ల స్థాయిలోనే రూపొందనున్నాయి. అంటే, గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్‌కు బదులుగా దిల్ రాజు మార్క్ మళ్లీ చూపించే ప్రయత్నం బలంగా ఉన్నట్టే. అటు స్టార్ హీరోలు, ఇటు క్రేజీ దర్శకులతో కలసి ఇండస్ట్రీకి భారీ సినిమాలు ఇవ్వాలన్న ఆయన లక్ష్యం, ఈ ప్రాజెక్ట్ లైన్‌అప్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి గేమ్ ఛేంజర్‌పై వచ్చే విమర్శలకు దగ్గర్లోనే కౌంటర్ ఇచ్చే ప్రాజెక్టులు ఇవే కావొచ్చు.

ఈసారి దిల్ రాజు ప్లానింగ్ చూస్తుంటే బలంగా బ్యాక్‌ఫుట్ నుంచి కమ్‌బ్యాక్‌కు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ప్రేక్షకులు మెచ్చే కంటెంట్, స్టార్డమ్ కలిసొచ్చేలా ఉండే చిత్రాలు సిద్ధం చేయాలని దిల్ రాజు యోచన. గేమ్ ఛేంజర్ ఓ కోతగా నిలిచినా, అది మాత్రమే అంతిమమయ్యే సినిమా కాదని, త్వరలోనే మళ్లీ విజయ పథంలోకి వస్తారని ఆయన ప్రయత్నాలు స్పష్టంగా చెబుతున్నాయి. మరి రాజుగారి నెక్స్ట్ సినిమాలు బాక్సాఫీస్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News