బన్నీకి సన్ పిక్చర్స్ వాటా కూడా ఇస్తుందా?
అయితే ఈసినిమాలో భాగస్వామ్యం కావాలని అల్లు అరవింద్ కొన్ని ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. బడ్జెట్ ఎంత అన్నది ఇంకా క్లారిటీ రాలేదు గానీ వందల కోట్ల ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. అయితే ఈసినిమాలో భాగస్వామ్యం కావాలని అల్లు అరవింద్ కొన్ని ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. గీతా ఆర్స్ట్ ని సినిమాలో భాగం చేయాలని, సమ ర్పణగా వేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలొచ్చాయి.
కానీ అందుకు సన్ పిక్చర్స్ అంగీకరించలేదని తెలిసింది. ఇలా భాగస్వామ్యం కుదరకపోవడంతో బన్నీ ఆ సినిమా చేయడం లేదని కూడా మీడియాలో ప్రచారం జరిగింది. ప్రాజెక్ట్ రద్దవుతుందని...అందుకు కారణం ఒప్పందం కుదరకపోవడంతోనేనని కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. అటుపై కొన్ని రోజులకు బన్నీకి భారీ పారితోషికం ఆఫర్ చేసి అన్ని సమస్యలను పరిష్కరించుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఈ సినిమాకి బన్నీ 170 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే సినిమాలో 15 శాతం వాటా వచ్చేలా సన్ పిక్చర్స్ తో ఒప్పందం చేసుకున్నట్లు వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. బన్నీ కి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. బన్నీ బ్రాండ్ తోనే సినిమా మార్కెట్ అయిపోతుంది. పుష్ప ప్రాంచైజీ 2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.
అందులో రెండవ భాగమే 1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. నార్త్ మార్కెట్ లో వందల కోట్లు రాబట్టింది. మొదటి భాగం కూడా నార్త్ రీజియన్ లోనే భారీ వసూళ్లను రాబట్టింది. ఈసారి తమిళ్ డైరెక్టర్-ప్రొడక్షన్ హౌస్ కావడంతో తమిళ్ మార్కెట్ పై కూడా గట్టిగానే గురి పెట్టే అవకాశం ఉంది. ఈనెలాఖరుకల్లా ప్రాజెక్ట్ గురించి అధికారికంగా విషయాలు తెలిసే అవకాశం ఉంది.