బ్రేకప్ కపుల్స్‌ని మమ్మీ డాడీ అనేసింది!
ఆ తర్వాత రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా అజాద్ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది.;
బాలీవుడ్ లో చాలా మంది నటవారసురాళ్లు లక్ చెక్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు షారూఖ్ కుమార్తె సుహానా, శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా అజాద్ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. నటవారసురాళ్లు సుహానా, ఖుషీలను మించిన క్రేజ్ రాషా సంపాదించుకుంది.
దానికి కారణం రవీనా టాండన్ లోని ఛామ్ తో రాషా తడానీ ఆకర్షించడమే. రాషా డ్యాన్సుల్లో ఎనర్జీ యూత్ కి కిక్కునిచ్చింది. అజాద్ లో అజయ్ దేవగన్ మేనల్లుడు ఆమన్ దేవగన్ సరసన రాషా నటించింది. ఇక రాషా తడానీ ఇటీవలి స్నేహాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఓ బర్త్ డే పార్టీలో తనకు పరిచయమైన మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు చాలా క్లోజ్ అయిపోయింది. తమన్నా- విజయ్‌లను అత్యంత ఆప్తులుగా ఆదరిస్తోంది. తమన్నా- విజయ్ బ్రేకప్ వార్తల నడుమ రాషా తడానీ తాజా కామెంట్ హాట్ టాపిగ్గా మారింది.
ఇంతకుముందు తన బర్త్ డే పార్టీకి విచ్చేసిన తమన్నాను ఆంటీ! అని పిలిచేసిన ఈ కుర్రబ్యూటీ... ఇప్పుడు ఏకంగా తమన్నా - విజయ్ లను గాడ్ పేరెంట్స్ అని పిలవడం చర్చగా మారింది. ఒక పార్టీలో గాయకుడు పాడుతుంటే తాను డ్యాన్స్ చేస్తున్నానని, ఆ సమయంలో అక్కడికి వచ్చిన తమన్నా తనతో పాటు ఆ పాటకు స్టెప్పు కలిపిందని రాషా తెలిపింది. అప్పటి పరిచయం తర్వాత వేగంగా అనుబంధం పెరిగిందని తెలిపింది. తమన్నాతో తనకు ఎంతగానో అనుబంధం ఉందని, విజయ్-తమన్నా తనకు అత్యంత సన్నిహితులని భావిస్తున్నానని రాషా పేర్కొంది. త్వరగా బంధం ఏర్పరచుకున్నాము. ఇప్పుడు తను(తమన్నా) లేకుండా నేనేం చేయాలో నాకు తెలియదు. ప్రస్తుతం తమన్నా- విజయ్ వర్మ నాకు అత్యంత సన్నిహితులు. వారు నా గాడ్ పేరెంట్స్ లాంటివారు... అని రాషా తడానీ వ్యాఖ్యానించింది.
ఇటీవల రాషాకు 20 ఏళ్లు నిండినప్పుడు తమన్నా ముంబైలో జరిగిన తన పుట్టినరోజు వేడుకకు కూడా హాజరయ్యారు. నిర్మాత ప్రగ్యా కపూర్ హోలీ పార్టీలో కూడా రషాతో కలిసి గడిపిన వీడియోలు రిలీజయ్యాయి. తడానీ ఫ్యామిలీతో తమన్నా అనుబంధం నేపథ్యంలో ఆ కుటుంబం నిర్మించే సినిమాల్లోను తమన్నా నటించే అవకాశం ఉంది. రాషా తడానీతో తదుపరి చిత్రాల్లోను తమన్నా నటిస్తుందేమో చూడాలి. అయితే మిల్కీ బ్యూటీ రాషాకు ఆంటీగానో, మమ్మీ గానో నటిస్తుందేమో! అని నెటిజనులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. విజయ్ నుంచి తమన్నా విడిపోయిన క్రమంలో రాషా తడానీ వ్యాఖ్య నెటిజనుల్లో చర్చగా మారింది.
రాషా తడానీ తొలి చిత్రం `ఆజాద్` జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. మార్చి 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. దీనికి మోస్తరు సమీక్షలు వచ్చాయి. ఇందులో ఉయ్ అమ్మా పాటలో రాషా నృత్యాలు కుర్రకారును ఆకట్టుకున్నాయి. తమన్నా చివరిసారిగా తమిళ చిత్రం `అరణ్మనై 4`లో కనిపించింది. తెలుగు చిత్రం ఓదేలా 2లో నటిస్తోంది. `డేరింగ్ పార్టనర్స్` అనే వెబ్ సిరీస్ షూటింగ్ కూడా చేస్తోంది.