దేవియాని.. మినీ స్కర్ట్ లో కిర్రాక్ స్టిల్
నటనతో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. గ్లామర్ ఫొటోషూట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది.;
టాలెంటెడ్ యాక్ట్రెస్ దేవియాని శర్మ తన నటనతో పాటు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌తో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది. మోడలింగ్‌లో కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముంబై బ్యూటీ, 'అనగనగా', 'సైతాన్', 'సేవ్ ద టైగర్స్' వంటి వెబ్‌సిరీస్‌ల ద్వారా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నటనతో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. గ్లామర్ ఫొటోషూట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది.
ఇక లేటెస్ట్ గా దేవియాని షేర్ చేసిన ఫోటోస్ మరోసారి నెటిజన్లను షాక్‌కు గురి చేశాయి. పింక్ బౌ డిజైన్ ఉన్న ట్రెండీ టాప్, రెడ్ మినీ స్కర్ట్ కాంబినేషన్‌లో స్టైలిష్‌గా కనిపించిన దేవియాని.. డేర్ లుక్‌తో అటెన్షన్ దక్కించుకుంది. సింపుల్ మేకప్, సాఫ్ట్ కర్ల్ హెయిర్ స్టైల్‌తో ఆమె మోడరన్ ఎలిగెన్స్‌ను ప్రెజెంట్ చేసింది. చేతిపై ఉన్న టాటూ, కిల్ ద లుక్ అనే విధంగా ఇచ్చిన క్యాప్షన్‌తో ఫోటోకు మరింత హైపు వచ్చింది.
ఈ లుక్‌లో దేవియాని కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఫోటోలో ఉన్న పొజ్, నయన సౌందర్యం చూసిన నెటిజన్లు ‘ఫైర్’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’, ‘ఫ్యాషన్ ఐకాన్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ ఫోటోకు "జస్ట్ కిల్ ఇట్" అనే క్యాప్షన్ ఉంది. ఇది ఈ లుక్‌కు ఎంత కాన్ఫిడెంట్‌గా పోజ్ ఇచ్చిందో తెలిపేలా ఉంది.
అందం, అభినయం, స్టైల్.. ఈ మూడింటినీ మిక్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. వెబ్ సిరీస్‌లతో పాటు త్వరలోనే ఫీచర్ ఫిల్మ్‌లకు కూడా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఫొటోషూట్స్‌కు ఇచ్చే ప్రాధాన్యత, క్యాప్షన్స్‌కు లోపల ఉన్న భావోద్వేగం చూస్తే.. దేవియాని కెరీర్ మరింత డైనమిక్‌గా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ గ్లామరస్ లుక్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న దేవియాని.. తన ఫ్యాషన్ గేమ్‌ను మళ్లీ ఒక లెవెల్‌కు తీసుకెళ్లిందనే చెప్పాలి.