బిగ్ బాస్ 9 హోస్ట్ పై క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

సీజన్ 8 సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో పూర్తి కాగా రాబోతున్న సీజన్ 9 ని జూన్ లేదా జూలై లోనే మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.;

Update: 2025-03-23 02:30 GMT

బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ సీజన్ 9 త్వరగానే మొదలవుతుంది అన్న న్యూస్ ఇప్పటికే తెలియగా దాని గురించి మరిన్ని డీటైల్స్ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. ఐతే బిగ్ బాస్ టీం ఈసారి సీజన్ 9 ని సంథింగ్ స్పెషల్ నెవర్ బిఫోర్ అనేలా ఉండేలా చేయాలని అనుకుంటున్నారు. అందుకే బిగ్ బాస్ 9 కి సంబంధించిన విషయాలను ముందు నుంచే మీడియాలో ఉండేలా చూస్తున్నారు. సీజన్ 8 సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో పూర్తి కాగా రాబోతున్న సీజన్ 9 ని జూన్ లేదా జూలై లోనే మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదలయ్యే టైం లో హోస్ట్ గురించి రకరకాల వార్తలు వస్తాయి. ముఖ్యంగా సీజన్ 3 నుంచి హోస్ట్ గా కొనసాగుతున్న నాగార్జునని పక్కన పెట్టి కొత్త హోస్ట్ ని తీసుకొస్తారని దాదాపు రెండు మూడు సీజన్లుగా వస్తూనే ఉంది. బిగ్ బాస్ ప్రతి సీజన్ మొదలయ్యే ముందు కంటెస్టెంట్ ఎవరెవరు అనే కన్నా హోస్ట్ గా నాగార్జున కాదు ఆ స్టార్ ఈ స్టార్ అన్న వార్తలే వైరల్ అవుతాయి.

కానీ తీరా షో మొదలయ్యే టైం కి మన కింగ్ రంగంలోకి దిగుతాడు. ఐతే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చేయడానికి కారణాల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఆ సెట్ ఉండటం. సో మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకుని నాగార్జున హోస్ట్ చేస్తారని తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 కి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతారా లేదా అన్నది కూడా డౌట్ గానే చెబుతున్నారు.

ఈసారి నాగార్జుననే తన సినిమాలకు బిగ్ బాస్ కు సెట్ అవ్వట్లేదని తప్పుకునే ఆలోచనలో ఉన్నారని టాక్. ఐతే నాగార్జున కాకుంటే బిగ్ బాస్ తెలుగు హోస్ట్ ఎవరన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. రానా, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వాళ్లు ఈ షో మీద అంత ఆసక్తి చూపిస్తారా అన్న డౌట్ ఉంది.

బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఎవరన్నది మరికొద్ది రోజుల్లో అంటే ఏప్రిల్ చివర్లో లేదా మే ఫస్ట్ వీక్ లో ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. ఈసారి నాగార్జున కాకుండా కొత్త హోస్ట్ వస్తే షో మీద నిజంగానే స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News