ఆ క్రైమ్ కథలో లాజిక్ లేదని రాస్తారేమో!
ఇంటర్వ్యూలో భాగంగా సంగీత్ శోభన్, నిర్మాత నాగవంశీని ఎందుకు సప్తసాగరాలు దాటి లాంటి శాడ్ సినిమాలు నచ్చవని చెప్తుంటారు మీరు అని అడిగాడు.;
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించిన మ్యాడ్ స్వ్కేర్ మార్చి 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగ వంశీ, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ను సంగీత్ శోభన్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో నాగ వంశీ మ్యాడ్ స్వ్కేర్ గురించి మరియు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఇంటర్వ్యూలో భాగంగా సంగీత్ శోభన్, నిర్మాత నాగవంశీని ఎందుకు సప్తసాగరాలు దాటి లాంటి శాడ్ సినిమాలు నచ్చవని చెప్తుంటారు మీరు అని అడిగాడు. దానికి నాగవంశీ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలుంటాయి. కష్టాలు, బాధలు లేని మనిషే ఉండడని, ఒకవేళ ఉంటే వాళ్లు మనుషులు కాదు దేవుళ్లే అని చెప్పాడు.
తమ కష్టాలన్నింటినీ మర్చిపోయి రెండు గంటల పాటూ ఎంజాయ్ చేయడానికి సినిమాకు వస్తే మనం సినిమాతో నవ్వించాలి లేదంటే తమ ఫేవరెట్ హీరోలను చూపించి వారికి హై మూమెంట్స్ ఇవ్వాలి తప్పించి సినిమాల్లో కూడా మనం కష్టాలనే చూపించి, వారి బాధలనే చూపిస్తుంటే వాళ్లు ఎంజాయ్ చేసేదేముందనిపిస్తుందని, అందుకే తనకు శాడ్ సినిమాలు నచ్చవని నాగవంశీ చెప్పాడు.
అలా అనుకున్నప్పుడు జెర్సీ ఎంటర్టైనింగ్ సినిమా కాదు కదా, ఒక ఫెయిల్యూర్ మ్యాన్ కథను ఎందుకు చూపించారు అని సంగీత్ అడగ్గా దానికి నాగవంశీ సమాధానం చెప్పాడు. అందరూ జెర్సీ సినిమాను శాడ్ సినిమా శాడ్ ఎండింగ్ అనుకుంటారు కానీ క్లైమాక్స్ లో కొడుకు వచ్చి చెప్తాడు, మా నాన్న ఫెయిల్యూర్ కాదు, చనిపోతానని తెలిసి కూడా ఫైట్ చేసి గెలిచాడని గర్వంగా చెప్తాడు. ఇండియన్ టీమ్ కు సెలెక్ట్ అయిన ఓ సక్సెస్‌ఫుల్ పర్సన్ కథలానే జెర్సీని చూపించామని, ఆడియన్స్ కూడా అదే హై లో థియేటర్ నుంచి బయటికొస్తారని నాగవంశీ చెప్పాడు. నాగవంశీ జెర్సీ గురించి చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక మ్యాడ్ స్వ్కేర్ సినిమాలో ఒక చిన్న క్రైమ్ స్టోరీని లింక్ చేశామని, అందులో ఎలాంటి లాజిక్ ఉండదని, రేపు సినిమా చూశాక రివ్యూల్లో ఆ క్రైమ్ కథలో లాజిక్ లేదని రాస్తారేమో, దాన్ని కేవలం కథలో మరికొంత కామెడీని జెనరేట్ చేయడానికే పెట్టాం తప్పించి అందులో ఎలాంటి లాజిక్స్ లేవని ముందే చెప్తున్నానని నాగవంశీ తెలిపాడు.