ప్రభాస్ కి అన్నయ్య అతడే అయితే సంచలనమే!
ఇప్పుడా భారీ కటౌట్ తో సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` చిత్రానికి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే.;
పాన్ ఇండియాలో ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అతడి కటౌట్ కూడా అలాంటిం దే. అందుకే ఇండియాలో ఎంత మంది స్టార్లు ఉన్నా? ప్రభాస్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అతడు పాన్ ఇండియాకి కనెక్ట్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం ఆ కాటౌట్ కూడా ఒకటి.` సాహో` చిత్రం సౌత్ లో ఫెయిలైనా నార్త్ మార్కెట్ లో మాత్రం సంచలన వసూళ్లు రాబట్టినప్పుడు మరోసారి డార్లింగ్ స్టామినా ఏంటన్నది అర్దమైంది.
అటుపై `సలార్`, `కల్కి 2898` లాంటి బ్లాక్ బస్టర్లతో మరింత స్ట్రాంగ్ అయ్యాడు. ఇప్పుడా భారీ కటౌట్ తో సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` చిత్రానికి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ కాఫ్ గా కనిపించనున్నాడు. సందీప్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో నెక్స్ట్ లెవల్ యాక్షన్ ఉంటుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చేసాడు.
మరి అలాంటి కంటెంట్ లో సంజయ్ దత్ కూడా భాగమైతే ఎలా ఉంటుంది? అందులోనూ ప్రభాస్ కి అన్నయ్య పాత్రలో ఖల్ నాయక్ కనిపిస్తే ఇంకెలా ఉంటుంది? వెండి తెరపై అది అద్భుతమే కదా. ఇప్పుడా ఛాన్స్ తీసుకోవడానికి సందీప్ రెడ్డి వంగా సిద్దంగా ఉన్నట్లు సన్నిహితుల సమాచారం. ప్రభాస్ కి అన్నయ్య పాత్రలో సంజయ్ దత్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
ప్రభాస్ వయసు..కటౌట్ ఆధారంగా సంజయ్ దత్ అయితే పక్కాగా సరితూగుతాడని సందీప్ భావిస్తు న్నాడుట. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సంజయ్ దత్ సౌత్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. `కేజీఎఫ్` లో విలన్ గా నటించాడు. `లియో`, `డబుల్ ఇస్మార్ట్` లోనూ నటించాడు. ఈ చిత్రాలు సౌత్ లో ఆయనకు మంచి క్రేజ్ ని తీసుకొచ్చినవే.