రెండేళ్లైనా స‌మంత‌కు ప్రేమ త‌గ్గ‌లేదు

త‌క్కువ టైమ్ లోనే సౌత్ లోని అగ్ర‌ హీరోలంద‌రితో న‌టించి స్టార్ హీరోయిన్ గా మారిన సమంత‌, కెరీర్ పీక్ లో ఉన్న‌ప్పుడే నాగ‌చైత‌న్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది;

Update: 2025-03-22 07:34 GMT

ఏ మాయ చేసావే సినిమాతో విప‌రీత‌మైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది స‌మంత‌. త‌క్కువ టైమ్ లోనే సౌత్ లోని అగ్ర‌ హీరోలంద‌రితో న‌టించి స్టార్ హీరోయిన్ గా మారిన సమంత‌, కెరీర్ పీక్ లో ఉన్న‌ప్పుడే నాగ‌చైత‌న్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ త‌ర్వాత ఇద్ద‌రికీ మ‌నస్ప‌ర్థ‌లు రావ‌డంతో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడిపోయారు.

ఆ త‌ర్వాత స‌మంత‌కు ఆరోగ్యం క్షీణించి మ‌యోసైటిస్ అనే వ్యాధితో బాధ ప‌డ‌టం, ఆ వ్యాధి చికిత్స నిమిత్తం కొంత కాలం పాటూ సినిమా నుంచి బ్రేక్ తీసుకున్న స‌మంత ఇప్పుడు మ‌ళ్లీ త‌న సినిమాల వేగాన్ని పెంచుతోంది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ కోసం వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి స‌మంత సిటాడెల్ హ‌నీ బ‌న్నీ చేసి మంచి రెస్పాన్స్ అందుకున్న విష‌యం తెలిసిందే.

వెబ్ సిరీస్ అయితే వ‌చ్చింది కానీ స‌మంత నుంచి సినిమా వ‌చ్చి ఇప్ప‌టికి రెండేళ్లవుతుంది. మామూలుగా ఇండ‌స్ట్రీలో ఎవ‌రైనా స‌రే రెగ్యుల‌ర్ గా ఆడియ‌న్స్ కు క‌నిపిస్తుంటేనే వారికి ప్రేమాభిమానాలు ద‌క్కుతుంటాయి. స్క్రీన్ పై క‌నిపించ‌క‌పోతే ఆ ఎఫెక్ట్ ఎంత‌లేద‌న్నా వారి ఫాలోయింగ్ పై ప‌డుతుంద‌నేది నిజం.

కానీ స‌మంత మాత్రం త‌న‌కు ఆ స‌మ‌స్య లేదంటోంది. ఇండ‌స్ట్రీలో చేసిన సినిమాలు హిట్టైతేనే వారికి క్రేజ్, ప్రేమ‌, అభిమానాలు పుష్క‌లంగా ఉంటాయి. కానీ తాను సినిమా చేసి రెండేళ్ల‌యినా త‌న‌పై ఆడియ‌న్స్ కు ఏ మాత్రం ప్రేమ త‌గ్గ‌లేద‌ని రీసెంట్ గా చెన్నైలో జ‌రిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ స‌మంత ఎమోష‌న‌ల్ అయింది.

సౌత్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన స‌మంత ఇప్పుడు నార్త్ లో కూడా త‌న స‌త్తా చాటుతోంది. ఇక‌పై వ‌రుస‌పెట్టి సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్న స‌మంత ఓ వైపు న‌టిగా, మ‌రోవైపు నిర్మాత‌గా కూడా దూసుకెళ్లాల‌ని చూస్తోంది. ఆల్రెడీ స‌మంత నిర్మాత‌గా రూపొందిన శుభం సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు రీసెంట్ గా అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. దీంతో పాటూ నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందంటున్నారు. వీటితో పాటూ బాలీవుడ్ లో కూడా స‌మంత ప‌లు ప్రాజెక్టులు చేయాల‌ని చూస్తోంది.

Tags:    

Similar News