కోర్ట్ బాక్సాఫీస్ తీర్పు: 8వ రోజు కూడా అదే రేంజ్ లో..

కోర్ట్ డ్రామా సినిమాలకు అవార్డులు తప్ప అంతగా కలెక్షన్స్ రావని అనుకున్న తరుణంలో ఈ సినిమా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది.;

Update: 2025-03-22 09:35 GMT

చిన్న సినిమాగా వచ్చిన ‘కోర్ట్’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. స్టార్ హీరోల సినిమాల రేంజ్ లోనే ఈ సినిమా కలెక్షన్లు దూసుకెళ్లేలా ఉన్నాయి. నాని ప్రెజెంట్ చేసిన ఈ కోర్ట్ డ్రామా నాన్ హైప్ సినిమాగా వచ్చి, కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి రోజు నుంచే సినిమా దూసుకుపోతోంది. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు వరుసగా రికార్డులే క్రియేట్ అవుతున్నాయి.


కోర్ట్ డ్రామా సినిమాలకు అవార్డులు తప్ప అంతగా కలెక్షన్స్ రావని అనుకున్న తరుణంలో ఈ సినిమా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. మొదటి రోజు రూ. 8.10 కోట్ల గ్రాస్‌తో మొదలైన ఈ మూవీ, మూడు రోజుల్లోనే రూ. 24.4 కోట్లను వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్లతో ఆ ఉత్సాహం కొనసాగింది. ఐదు రోజుల్లో సినిమా రూ. 33.55 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసింది. ఆరో రోజు ఈ వేగం కంటిన్యూ అవుతూ రూ. 36.85 కోట్ల మార్క్‌ను అందుకుంది.

వారం ముగిసే నాటికి ఈ చిన్న చిత్రం రూ. 39.60 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ప్రేక్షకుల నుంచి వచ్చిన బ్లాక్‌బస్టర్ టాక్, సోషల్ మీడియాలో పాజిటివ్ ట్రెండ్ సినిమాకు కలిసొచ్చాయి. యూఎస్ఏలో కూడా $900K దాటిన ఈ చిత్రం త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టనుందని ట్రేడ్ వర్గాల అంచనా.

తాజాగా 8వ రోజు వరకూ వచ్చిన కలెక్షన్ల ప్రకారం.. కోర్ట్ వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 42.30 కోట్లను దాటేసింది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు ఇప్పటికే థియేటర్లు పెరుగుతున్నాయి. పాజిటివ్ టాక్ బలంగా నిలిచేలా ఉన్నందున ఈ ఫలితాలు మరింత బలంగా మారే అవకాశముంది. ముఖ్యంగా ఏ ఒక్క స్టార్ హీరో లేకుండా కంటెంట్ బేస్డ్ చిత్రానికి ఇంత ఆదరణ రావడం అరుదైన విషయం.

కోర్ట్ కలెక్షన్ల రన్ చూస్తుంటే లాంగ్ రన్‌లో 60 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. పైగా ప్రస్తుతం అంతగా పోటీని ఇచ్చే సినిమాలు లేవు. వచ్చే వీకెండ్ వరకు మంచి రన్ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్, ప్రేక్షకుల స్పందన చూస్తే.. ఇది నానితో పాటు దర్శకుడు రామ్ జగదీష్‌కు కూడా ఎంతో ప్రెస్టీజియస్ విజయంగా నిలుస్తోంది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించిన సినిమా ఇది.

Tags:    

Similar News