అభిమానుల కోసం ఆయనే మారాడా?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లకు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్నారో తెలిసిందే.;
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లకు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్నారో తెలిసిందే. అభిమానులంతా `ఓజీ ఓజీ` అంటూ నానా హంగామా క్రియేట్ చేస్తున్నారు. ఆయన ప్రజా సమస్యల పై...ప్రభుత్వ పాలనపైనా మాట్లాడుతుంటే `ఓజీ ఓజీ` అంటూ కింద నుంచి కేకలేస్తున్నారు. దీంతో ఆయన కూడా రెండు...మూడు సందర్భాల్లో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు.` మీరు మారరా?` అంటూ ఒకసారి `సమయం..సందర్బం లేదా`? అంటూ మరోసారి కస్సుమన్నారు.
అయినా అభిమానుల్లో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా కర్నూల్ లో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా మళ్లీ `ఓజీ` నినాదాలు అందుకున్నారు. `మీరు మారరా` అంటూ పీకే స్వరం అందుకున్నారు. అయితే ఈసారి ఆయన `చిరునవ్వతో మారరా`? అన్నారు. ఇక్కడిదే సర్ ప్రైజ్. ఎప్పుడూ చిరాకు పడే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం నవ్వుతూ స్వాగతించడం ఇంట్రెస్టింగ్. అభిమానులు ఎలాగూ మారరు..తనే మారాలనుకున్నారో ఏమో! అందుకే ఇలా.
ఏదీ ఏమైనా పవన్ నవ్వడం అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. అభిమానుల కోసమైనా పీకే సినిమాలు చేస్తారు? అన్న ధీమా వాళ్లలో మళ్లీ మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ లు పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు ఉన్న సంగతి తెలిసిందే.
`హరిహరవీరమల్లు` కోసం నాలుగు రోజులు డేట్లు ఇవ్వాలి. ఇస్తే షూటింగ్ ముగించి మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఓజీ షూటింగ్ కూడా ముగింపు దశలోనే ఉంది. పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. వాళ్లకు డేట్లు ఇస్తే వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.