ఐపీఎల్ లో రాబిన్ హుడ్ రేంజ్ పెంచేలా.. అదిరిపోయే ప్లాన్
ఇక తెలుగు రాష్ట్రాల్లో డేవిడ్ వార్నర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;
ఐపీఎల్ 18వ సీజన్ వచ్చేసింది. ఇక ఉదయం అంత లైఫ్ తో బిజీగా ఉండే వారు రాత్రికి మ్యాచ్ చూసేందుకు సిద్ధమవుతు ఉంటారు. ఇక క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఐపీఎల్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాబిన్ హుడ్ టీమ్ మాత్రం వార్నర్ తోనే వీలైనంత ఎక్కువ బజ్ క్రియేట్ చేయాలని చూస్తోంది. అందుకే చిత్ర యూనిట్ కూడా ఆటలోకి వెళ్లి మరీ ఆడియెన్స్ మనసు దోచే ప్రయత్నం చేస్తోంది
ఇక తెలుగు రాష్ట్రాల్లో డేవిడ్ వార్నర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ గెలిపించిన కెప్టెన్‌గా, హైదరాబాద్ అభిమానులకు ఇంటి ముద్దుబిడ్డగా మారిపోయిన ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ఇప్పుడు కొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. క్రికెట్ ఆడని ఈ సీజన్‌లోనూ ఆయన క్రేజ్ తగ్గలేదు. ఒకవేళ బ్యాట్ చేతిలో లేకపోయినా.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై దూసుకొస్తున్నాడు.. అది కూడా తెలుగు సినిమాలో.
వార్నర్ నటిస్తున్న నితిన్ సినిమా రాబిన్ హుడ్ ఇప్పటికే బాగానే హైప్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఐపీఎల్ నేపథ్యాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే SRH vs RR మ్యాచ్‌కు నితిన్, శ్రీలీలతో కలిసి వార్నర్ హాజరుకానున్నాడు. ఇది కేవలం ఒక ప్రోమోషన్ ఈవెంట్ కాదనిపిస్తోంది. ఇది ఒక క్రాస్ ఓవర్ హైప్ స్ట్రాటజీ. స్పోర్ట్స్ + సినిమా + స్టార్ కంటెంట్.. ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు.
వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో పాత్ర పోషించడం, ఆ సినిమాలో నటీనటులతో కలసి మ్యాచ్ వేదికను ప్రమోషన్ ప్లాట్‌ఫామ్‌గా వాడుకోవడం ఒక స్మార్ట్ మూవ్. ఐపీఎల్ ప్లే చేసే జట్టుకే కాదు, సినిమాలోకి కూడా ఈ క్రేజీ బ్రాండింగ్ తీసుకొస్తున్నాడు వార్నర్. ఇది SRH అభిమానుల్లోనూ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం కల్పించేలా ఉంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ మల్టీ-డైనమిక్ ప్రమోషన్ స్టైల్‌తో సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక క్రికెట్ సీజన్‌లో సినిమా విడుదల చేస్తుండటం కూడా స్ట్రాటజికల్. ఫ్యాన్స్ స్టేడియం సందడిలో ఉన్నప్పుడు వార్నర్ అనే బ్రాండ్ సినిమాతో కనెక్ట్ అవడం పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. పైగా సోషల్ మీడియాలో ఇప్పటికే వార్నర్-నితిన్-శ్రీలీల కలయికపై మెసేజ్‌లు, రీల్స్ వైరల్ అవుతున్నాయి. అటు SRH క్రేజ్‌ని ఇటు సినిమా వైపు తిప్పేందుకు ఈ స్టంట్ పనికొచ్చేలా ఉంది. ఈ సమ్మర్ సీజన్‌లో రాబిన్ హుడ్ ఓ మాస్ ఎంటర్టైనర్‌గా నిలవాలంటే.. ఇలా కొత్తగా ఆడియన్స్‌కి దగ్గరవ్వాల్సిందే. వార్నర్ సహాయంతో SRH క్రేజ్‌ని బలంగా ఉపయోగించుకుంటూ, సినిమాకు మరింత దారితీస్తున్నారు. మరి ఈ స్ట్రాటజీ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.