పెద్దమ్మ అశీస్సులతో శివన్న రంగంలోకి!
ఆ సంగతి పక్కనబెడితే తాజాగా శివన్న హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్ లో ప్రత్యక్షమయ్యారు.;

శాండిల్ వుడ్ స్టార్ శివ రాజ్ కుమార్ ఇటీవలే అమెరికాలో క్యాన్సర్ చికిత్స తీసుకుని బెంగుళూరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుని పూర్తిగా కొలుకున్నారు. క్యాన్సర్ ను జయించిన మరో నటుడిగా శివన్న పేరు నెట్టింట వైరల్ గానూ మారింది. మహామ్మారితో పోరాటం ఎంత కఠినమన్నది? తన భావోద్వేగాన్ని వివిధ సందర్భాల్లోనూ తెలిపారు.
తన వంతు బాధ్యతగా మహామ్మారిపై ఓ డాక్యుమెంటరీ కూడా చేస్తున్నారు. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా శివన్న హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్ లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అమ్మ ఆశీస్సులు అనంతరం ఆయన ఆర్సీ 16 షూటింగ్ కోసం బయల్దేరినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది.
ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తయింది. శివరాజ్ కుమార్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే అనారోగ్యం కారణంగానే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. తిరిగి కోలుకోవడంతో మళ్లీ టీమ్ తో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర రామ్ చరణ్ కి ధీటుగా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. క్రికెట్..కుస్తీ క్రీడల నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు.
మరి శివన్న ఎంట్రీ నేపథ్యంలో ఆయనపై ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తారు? అన్నది తెలియాలి. ప్రస్తుతానికి షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. క్రీడా నేపథ్యమైనా చరణ్ పాత్ర చాలా మాసీవ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.