'ఆహా' ఇప్పుడెండుకు ఈ ఫెయిల్యూర్ ఫకీర్ జర్నీ..?
మల్టీ ట్యాలెంటెడ్ స్టార్ ధనుష్ నటించిన మొదటి ఇంగ్లీష్ మూవీ 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'.;
మల్టీ ట్యాలెంటెడ్ స్టార్ ధనుష్ నటించిన మొదటి ఇంగ్లీష్ మూవీ 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'. 2018లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా దాదాపుగా రూ.175 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో విడుదలైన ఆ సినిమా ఆ సమయంలో కనీసం రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టలేకపోయింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్‌లో ఆ సినిమా కేవలం రూ.30 కోట్లు మాత్రమే రాబట్టిందని టాక్. సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా మాత్రం నిరాశ పరచింది. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ సినిమా స్క్రీనింగ్ చేశారు.
ధనుష్ అభిమానులు ఎంతో మందికి ఈ సినిమాపై ఆసక్తి ఉంటుంది. అసలు కథ ఏంటి, ఎందుకు సినిమా కమర్షియల్‌గా ఆడలేదు అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. తమిళ్ ప్రేక్షకులు, అభిమానులు థియేట్రికల్ రిలీజ్ సమయంలో చూడలేక పోయిన వారు ఓటీటీలో చూశారు. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ కాలేదు. విడుదలైన సమయంలో యాపిల్ టీవీ+లో ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అయింది. తెలుగులో స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆహా వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగులో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు.
మార్చి 26 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ ఒక రోజు ముందుగానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయవచ్చు. ఆహాలో ఈమధ్య కాలంలో క్రేజీ సినిమాలు రావడం లేదనే టాక్ వస్తున్న నేపథ్యంలో ధనుష్ నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం గంటన్నర నిడివితో సాగే ఈ సినిమాలో ధనుష్ విభిన్నమైన పాత్రలో కనిపించాడు. సినిమాలోని ధనుష్ నటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో స్ట్రీట్ మెజీషియన్‌గా లవ్ పటేల్ పాత్రలో ధనుష్ నటించాడు.
స్ట్రీట్ మెజీషియన్ అయిన లవ్ పటేల్ తనకు అతీత శక్తులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటాడు. కొన్ని కారణాల వల్ల విదేశాలు వెళ్లిన లవ్ పటేల్ అక్కడ ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అతడు ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది అనేది కథ. ఎమోషన్ సీన్స్‌తో పాటు వినోదభరిత సన్నివేశాల్లోనూ ధనుష్ కనబర్చిన నటన అద్భుతం అంటూ ప్రశంసలు దక్కించుకున్నాడు.
థియేట్రికల్ రిలీజ్ అయ్య దాదాపు ఆరు ఏళ్లు అవుతున్నా ధనుష్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం ఈ ఫెయిల్యూర్ మూవీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్‌లో ఫెయిల్ అయిన ఫకీర్ జర్నీ ఆహా ఓటీటీలో హిట్ కొట్టేనా చూడాలంటే మార్చి 26 వరకు వెయిట్ చేయాల్సిందే.