సినిమాల్లోకి లక్కీగా వచ్చా
డైరెక్టర్ గా ఎంతో భారీ సక్సెస్ లు అందుకున్న నాగ్ అశ్విన్ బయట చూడ్డానికి మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు.;
డైరెక్టర్ గా ఎంతో భారీ సక్సెస్ లు అందుకున్న నాగ్ అశ్విన్ బయట చూడ్డానికి మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. కొన్నిసార్లు ఆయన సింప్లిసిటీకి అందరికీ ఆశ్చర్యమేస్తుంది. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ్ అశ్విన్ ఉరఫ్ నాగి, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో పాటూ తనలో మ్యాటర్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు.
ఎవడే సుబ్రమణ్యం రిలీజై పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో ఆయన్నుంచి మూడు సినిమాలే మాత్రమే వచ్చాయి. కానీ ఆ మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్లుగా నిలిచాయి. నాగి ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజయంతీ మూవీస్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ నాగి గొప్పదనాన్ని చాటింది.
సినిమాల్లోకి లక్కీగా వచ్చానని చెప్తున్న నాగ్ అశ్విన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివి ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో డిగ్రీ కంప్లీట్ చేశాడు. స్కూల్ లో టాప్ టెన్ లో ఒకడిగా ఉన్న నాగిని చూసి తల్లిదండ్రుల్లానే డాక్టర్ అవుతాడనుకుంటే తాను మాత్రం మణిపాల్ మల్టీమీడియా కోర్సులో జాయినై అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్కడే నాగి వీడియో ఎడిటింగ్ తో పాటూ సినిమాకు అవసరమైన జ్ఞానాన్ని మొత్తం సంపాదించాడు.
కొడుక్కి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ను గుర్తించిన అతని తల్లిదండ్రులు శేఖర్ కమ్ముల దగ్గరకు గోదావరి సినిమా టైమ్ లో పంపగా, ఆ తర్వాతి ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చుకుంటానని చెప్పారట. ఈ లోపే నాగి మంచు మనోజ్ నేను మీకు తెలుసా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అప్పుడు అతనికి రూ.4 వేలు జీతమిచ్చారట.
ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు ఏడీగా వర్క్ చేసిన నాగ్ అశ్విన్ యాదోం కీ బరాత్ అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ ను ప్రియాంక దత్ నిర్మించింది. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఆ షార్ట్ ఫిల్మ్ ఫైనలైజ్ అయింది. దీంతో నాగి లైఫ్ టర్న్ అయిపోయి, వైజయంతీ బ్యానర్ లో మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చారు. అలా 2015లో విజయ్ దేవరకొండ, నాని ప్రధాన పాత్రల్లో ఎవడే సుబ్రమణ్యం సినిమా వచ్చింది.
మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా నంది అవార్డు అందుకున్న నాగి, రెండో సినిమాగా సావిత్రి బయోపిక్ ను మహానటి పేరుతో తీసి విమర్శకుల ప్రశంసలతో పాటూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా రెండో సినిమాకే నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇక మూడో సినిమాగా తెరకెక్కిన కల్కితో నాగి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. పదేళ్లలో మూడు సినిమాలే తీసినప్పటికీ నాగి డైరెక్టర్ గా తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా నాగి జాతిరత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుత జెనరేషన్ లో నాగి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. మున్ముందు నాగి కెరీర్ లో మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని ఆశిద్దాం.