2025-26 ఆ స్టార్ హీరో డైరీ ఫుల్!

రెండు సినిమాలు అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇవి గాక కార్తీ లైన‌ప్ చూస్తే రెండేళ్ల వ‌ర‌కూ మ‌రే డైరెక్ట‌ర్ కి దొరికేలా లేడు.;

Update: 2025-03-22 07:12 GMT

కోలీవుడ్ స్టార్ కార్తీ పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే 'స‌త్యం సుంద‌రం'తో మంచి విజ‌యం అందుకున్నాడు. ప్ర‌స్తుతం రెండు సినిమాలో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతు న్నాడు. 'స‌ర్దార్' కి సీక్వెల్ గా 'స‌ర్దార్ -2' చేసాడు. ఇది ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.అలాగే 'వా వాతియార్' కూడా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉంది.

రెండు సినిమాలు అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇవి గాక కార్తీ లైన‌ప్ చూస్తే రెండేళ్ల వ‌ర‌కూ మ‌రే డైరెక్ట‌ర్ కి దొరికేలా లేడు. త్వ‌ర‌లోనే లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖైదీ -2' మొద‌లవుతుంది. అలాగే హెచ్ వినోధ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖాకీ' సీక్వెల్ కూడా ప్ర‌క‌టించారు. 'ఖాకీ 2' టైటిల్ తో ప‌ట్టాలెక్కించాల‌ని రెడీ అవుతున్నారు. ఇటీవ‌లే గౌత‌మ్ మీన‌న్ తో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు.

ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్ల‌ర్ స్టోరీ కార్తీకి న‌చ్చ‌డంతో ఒకే చేసాడు. దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. పా రంజిత్, మారి సెల్వ‌రాజ్, సుంద‌ర్. సి, శివ లాంటి స్టార్ డైరెక్ట‌ర్లు కార్తీతో సినిమాలు చేయ‌డానికి క్యూలో ఉన్నారు. వీళ్లంతా ఇప్ప‌టికే స్టోరీలు వినిపించారు. అయితే వారంతా వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉండటంతో? ఓ ప్ర‌ణాళిక బ‌ద్దంగా ముందుకెళ్తున్నారు. వీళ్ల‌లో కొంత మందితే ఇప్ప‌టికే కార్తీ సినిమాలు చేసాడు.

ఆ రిలేష‌న్ కార‌ణంగానే కార్తీ కూడా వాళ్ల‌తో అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా సినిమాలు చేయ‌డానికి అంతే ఆస‌క్తి చూపిస్తుంటాడు. వీళ్లంద‌రితో కార్తీ సినిమాలు చేసి రిలీజ్ చేయాలంటే మ‌రో మూడేళ్ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంది. 2025-26 క్యాలెండ‌ర్ కూడా ఇప్ప‌టికే పుల్ అయింది. ఆ లిస్ట్ లో పై వాళ్ల‌లో కొంత మంది ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. అదీ సంగ‌తి.

Tags:    

Similar News