జాక్ పిల్ల గ్లామర్ డోస్.. కెవ్వు కేక

తొలి అవకాశమే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రంలో చిన్న పాత్రలో వచ్చింది కానీ అసలైన గుర్తింపు మాత్రం 'బేబి' సినిమా ద్వారా వచ్చింది.;

Update: 2025-03-22 16:43 GMT

తెలుగు యూట్యూబ్ ప్రపంచం నుంచి తెరపైకి వచ్చి, కాస్త ఆలస్యంగా అయినా త‌న కెరీర్‌ను స్టేడిగా సెట్ చేసుకుంటోంది నటి వైష్ణవి చైతన్య. తొలి అవకాశమే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రంలో చిన్న పాత్రలో వచ్చింది కానీ అసలైన గుర్తింపు మాత్రం 'బేబి' సినిమా ద్వారా వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆమె నటన, ఎంపిక చేసిన కథలపై సినీ ఇండస్ట్రీ దృష్టి పడింది. నెక్ట్స్ ఆమె నటించిన జాక్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.


అలాగే పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఇప్పుడు లేటెస్ట్ గా వైష్ణవి తన లేటెస్ట్ ఫోటోషూట్‌లో కనిపించిన స్టన్నింగ్ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నలుపు రంగు డిజైనర్ సిల్క్ డ్రెస్ లో మెరిసిపోయిన వైష్ణవి.. తన మోడ్రన్ అవతారాన్ని స్టైలిష్‌గా ప్రదర్శించింది. మాచింగ్‌గా ట్రెండీ బ్లాక్ షర్ట్ బ్లౌజ్ ధరించి, హై ఫ్యాషన్ డ్రెస్‌కు ఓ డిఫరెంట్ టచ్ ఇచ్చింది. దీని వల్ల ఆమె లుక్ మరింత రిచ్‌గా అనిపించింది.


ఈ ఫోటోల్లో వైష్ణవి వేసిన జ్యూయెలరీ, స్పెషల్ మెడ చైన్, సింపుల్ మేకప్, స్మోకీ ఐలైనర్ అన్నీ కలిపి ఆమెను కొత్తగా చూపించాయి. స్టైలిష్ హీల్ సాండల్స్, తక్కువ హెయిర్ బన్ స్టైల్ ఆమె లుక్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. “ఇంత గ్లామర్ వైష్ణవి దగ్గర చూసి ఆశ్చర్యపోతున్నాం” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక యూత్‌ఫుల్ హీరోయిన్ నుంచి ఇలాంటి సీరియస్ క్లాస్ లుక్ రావడం అంత ఈజీ కాదు.


ఫొటోగ్రఫీ కూడా సింపుల్ టోన్‌లో ఉండటంతో ఆమె డ్రెస్ ఎక్స్‌ప్రెషన్లు హైలైట్ అయ్యాయి. ఆమె స్థిరమైన గ్లామర్ గ్రోత్ చూసి, అభిమానులు సర్‌ప్రైజ్ అయ్యారు. ప్రస్తుతం వైష్ణవి చేసిన ఈ లుక్ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. అభిమానులు "బ్లాక్ మ్యాజిక్", "బేబీ క్యూట్ నుంచి స్టన్నింగ్ బ్యూటీగా మారిపోయావ్" అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. నటనతో పాటు స్టైల్‌లోనూ వైష్ణవి తనదైన ముద్ర వేసిందని అంటున్నారు.

Tags:    

Similar News