ఒక్కరోజు గ్యాప్ లో ఇద్దరి మధ్య పెద్ద యుద్దమే!
2026 మార్చి 20న బిగ్ ఫైట్ తప్పదా? `టాక్సిక్` వర్సెస్ `లవ్ అండ్` వార్ పోటాపోటీగా బరిలోకి దిగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది.;
2026 మార్చి 20న బిగ్ ఫైట్ తప్పదా? `టాక్సిక్` వర్సెస్ `లవ్ అండ్` వార్ పోటాపోటీగా బరిలోకి దిగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. `కేజీఎఫ్` తర్వాత యశ్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తోన్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇదీ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రం. కేజీఎఫ్ తో పాన్ ఇండియాలో యశ్ సంచలన స్టార్ గా మారాడు. ఈ నేపథ్యంలో అతని కోణంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆ అంచనాలను కిల్ చేస్తున్నాయి? అన్నది అంతే వాస్తవం. టీజర్ సహా కొన్ని రకాల ప్రచార చిత్రాలతో ఇది రొటీన్ గా అనిపించింది తప్ప ఏ మాత్రం కొత్తదనం కనిపించలేదు. ప్రతిగా యశ్ విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. ఈ సినిమా కోసం ఇంత సమయం వెచ్చించడమా? అంటూ నెగిటివిటీని ఎదుర్కున్నాడు. మరి రిలీజ్ సమయానికి ఆ నెగిటీని తొలగించుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.
ఇక రణబీర్ కపూర్ -అలియా భట్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. భన్సాలీ మార్క్ లవ్ స్టోరీ ఇది. స్వచ్ఛమైన ప్రేమను ఇందులో హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే భారీ యాక్షన్ సన్నివేశాలకు కొదవలేదు. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. ఇద్దరు కలిసి చాలా కాలం తర్వాత చేస్తోన్న లవ్ జోనర్ కావడంతో ఓ సెక్షన్ ఆడియన్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ రెండు సినిమాల్లో ఒకటి మార్చి 19న...మరొకటి 20న రిలీజ్ అవ్వడంతో? బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదు. `టాక్సిక్` పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. `లవ్ అండ్ వార్` కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. రెండు సినిమాల రిలీజ్ సమయంలోనే పబ్లిక్ హాలీడేస్ కూడా కలిసి రావడంతో? అంతి మంగా బాక్సాఫీస్ విజేత ఎవరు? అన్న దానిపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.