ఐకాన్ స్టార్ అప్పుడే అంత రిస్క్ తీసుకుంటాడా?
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు దుబాయ్ లో జరుగుతున్నాయి.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అట్లీ-బన్నీలు పారితోషికం ప్రాతి పదికనే ఈ ప్రాజెక్ట్ కి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని ప్రచారంలోకి వచ్చింది. బన్నీ మాస్ రోల్ లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు దుబాయ్ లో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బన్నీ దుబాయ్ టూ హైదరాబాద్ రౌండ్లు వేస్తున్నాడు. వెళ్లి రావడం తరుచూ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని లీకులు కూడా అందుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో బన్నీ హీరో కం విలన్ గా నటిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే బన్నీ అప్పుడే విలన్ పాత్రలు చేసే రిస్క్ తీసుకుంటాడా? అన్నది అతి పెద్ద సందేహం. బన్నీ గత సినిమా 'పుష్ప'లో హీరో అయినా? ఆ పాత్రలో తీవ్రమైన ప్రతి నాయకుడు ఛాయలు కనిపిస్తాయి.
ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించాడు. ఈ నేపథ్యంలో ఆ పాత్రపై బన్నీ తీవ్ర విమర్శలు కూడా ఎదు ర్కున్నాడు. సినిమాలో హీరో ఇలాంటి నెగిటివ్ పాత్రలు పోషిస్తే అతడు హీరో ఎలా అవుతాడు? అని మేథావర్గం అభిప్రాయపడింది. పండితులు దుమ్మెత్తి పోసారు. ఆ పాత్రకు జాతీయ అవార్డు రావడం ఏంటని? విమర్శలు కూడా గుప్పించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బన్నీ మళ్లీ ప్రతినాయకుడి పాత్ర పోషించే అవకాశాలు ఎంత మాత్రం ఉండవని ఆయన సన్నిహిత వర్గాల మాట్లాడుకుంటున్నాయి.
బన్నీ ఇప్పుడే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తనని తాన సోలోగా మరింత పాజిటివిటీగానే మార్కెట్ లోకి ఎక్కించుకోవాలి. సినిమా అనేది సమాజంపై ప్రత్యక్షంగానో..పరోక్షంగానో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుం ది? అన్నది వాస్తవం. ఈ విషయంలో హీరోలంతా మరింత చైతన్యవంతగా పనిచేయాలని అభ్యర్ధలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి బన్నీ అప్పుడే తనలో విలనీని పూర్తి స్థాయిలో బయటకు తీసే అవకాశం లేదంటున్నారు.