బాలీవుడ్‌లోని ఈ వింత అగ్రిమెంట్‌ గురించి తెలుసా?

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోబోతున్నట్లు నిధి అగర్వాల్‌ చాలా ఆశగా ఎదురు చూస్తుంది.;

Update: 2025-03-22 17:30 GMT

'ఇస్మార్ట్‌ శంకర్'తో సక్సెస్‌ను దక్కించుకున్న నిధి అగర్వాల్‌ ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో స్టార్‌డం దక్కించుకోలేక పోయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఎంపిక చేసుకున్న ప్రాజెక్ట్‌లు తీవ్రంగా నిరాశ పరిచాయి. కానీ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు ఆమె స్టార్‌డంను ఎక్కడికో తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌తో కలిసి హరి హర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్‌ మరో వైపు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలోనూ నటిస్తుంది. రాజాసాబ్‌ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోబోతున్నట్లు నిధి అగర్వాల్‌ చాలా ఆశగా ఎదురు చూస్తుంది.

ఆ సినిమాల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చే వరకు నిధి అగర్వాల్‌ కొత్త ప్రాజెక్ట్‌లను కమిట్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాకున్నా.. నిధి అగర్వాల్‌ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటో షూట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ద్వారా లేదంటే ఇంటర్వ్యూల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో ఇంటర్వ్యూతో నిధి అగర్వాల్‌ వార్తల్లో నిలిచింది. ఈసారి బాలీవుడ్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. నిధి అగర్వాల్‌ మొదటి సినిమా హిందీలోనే నటించిన విషయం తెల్సిందే. ఆ హిందీ సినిమాలో నటించేందుకు చేసుకున్న అగ్రిమెంట్‌ గురించి నిధి అగర్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

టైగర్ ష్రాఫ్‌ హీరోగా నటించిన 'మున్నా మైకేల్‌' సినిమాలో నిధి అగర్వాల్‌ నటించింది. అంతకు ముందు మోడలింగ్‌ చేసిన నిధి అగర్వాల్‌ బాలీవుడ్‌లో అవకాశం రావడంతో అగ్రిమెంట్‌ కనీసం చదవకుండానే సైన్ పెట్టిందట. ఆ అగ్రిమెంట్‌లో హీరోతో డేటింగ్‌ చేయకూడదని కండీషన్ ఉందట. సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యేంత వరకు హీరోతో రిలేషన్‌షిప్ పెట్టుకున్నట్లు తెలిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆ అగ్రిమెంట్‌లో ఉందట. ఆ విషయం తెలిసి నిధి అగర్వాల్‌ షాక్ అయిందట. ఇలాంటివి కూడా అగ్రిమెంట్‌లో పెడతారా అని ఆ సమయంలో ఆశ్చర్యపోయాను అంటూ నిధి అగర్వాల్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు అంది.

బాలీవుడ్‌లో కొత్త వారు పరిచయం అయ్యే సమయంలో హీరో, హీరోయిన్స్ మధ్య రిలేషన్‌షిప్ ఏర్పడటం అనేది అప్పుడు ఇప్పుడు కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అన్ని సార్లు జరగక పోయినా నిర్మాతలు ముందు జాగ్రత్తగా నో డేటింగ్‌ అనే కండీషన్‌ను పెడుతూ ఉంటారట. బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల సినిమా పరిశ్రమలోనూ కొత్త వారితో సినిమాలను నిర్మించే నిర్మాతలు ఇలాంటి అగ్రిమెంట్‌ చేసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. షూటింగ్‌ మధ్యలో ఉండగా రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం లేదంటే బ్రేకప్‌ కావడం వంటివి జరిగితే కచ్చితంగా ప్రభావం పడుతుంది. అందుకే షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు నో డేటింగ్‌ అనేది అగ్రిమెంట్‌లో పొందు పరచడం అనేది నిర్మాతల శ్రేయస్సుకు మంచిదే అనే అభిప్రాయాన్ని నిధి అగర్వాల్‌ సైతం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News