మండు వేసవిలో చల్లటి కబురు.. ఐపీఎల్ తొలి మ్యాచ్ వాన ముప్పు లేనట్లే

క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతతో చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది.;

Update: 2025-03-22 08:07 GMT

క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతతో చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఒక్కొక్కటే మార్పులు చేసుకుంటూ వచ్చిన 18వ సీజన్ మరింతగా ప్రేక్షకులను అలరించనుంది. అయితే, దేశంలో ఎండలు మండుతుండగా.. తూర్పున పశ్చిమ బెంగాల్ ను మాత్రం వర్షాలు చికాకుపెడుతున్నాయట.

బెంగాల్ రాజధాని కోల్ కతాలో డిఫెండింగ్ చాంపియన్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన ఐపీఎల్ -18 తొలి మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందనే కథనాలు మొన్నటి నుంచి జోరుగా వినిపించాయి.

ఒకవేళ వర్షంతో సీజన్ 18 తొలి మ్యాచ్ గనుక రద్దయితే ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అయ్యేదేమో..? వాస్తవానికి కోల్ కతాలో శుక్రవారం వరకు వర్షం పడింది. దీంతో శనివారం కూడా వాన ముప్పు తప్పదని అనుకున్నారు.

తాజాగా వాతావరణ పరిశీలన సంస్థ ఆక్యు వెదర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. కోల్ కతాలో శనివారం వర్షం పడే చాన్స్ లేదు. ఇక్కడి చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలోనే రాత్రి 7.30కు కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఉంది.

అయితే, మ్యాచ్‌ సమయానికి చినుకులూ కూడా పడవని.. ఆక్యు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. సాయంత్రం 4 గంటలకు కోల్‌ కతాలో మబ్బులు పట్టి ఉన్నప్పటికీ.. పొడి వాతావరణమే ఉంటుంది. 6 గంటలకు మధ్యాహ్నంతో పోలిస్తే మబ్బులు ఎక్కువగానే ఉంటాయి. కానీ, వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభ కార్యక్రమాలకు ఆటంకాలు ఉండకపోవచ్చు.

ఐపీఎల్ మ్యాచ్ 7.30కు మొదలుకానుండగా, 7 గంటలకు టాస్ వేస్తారు. అప్పటికి మబ్బులు ఉన్నా వర్షం పడే అవకాశం లేదు. గాలి నాణ్యతే కాస్త తక్కువగా ఉండనుంది. 12 గంటల వరకు.. అంటే మ్యాచ్‌ ముగిసేవరకు వర్షం ఆటంకం లేనట్లే. వాతావరణం పొడిగానే ఉంటుంది. తేమ శాతం ఎక్కువగా ఉంటుంది.

వర్షం ఆటంకం కలిగిస్తే 5 ఓవర్ల మ్యాచ్.. అదీ లేకుంటే రద్దు చేస్తారు. రెండు జట్లకూ చెరొక పాయింట్‌ కేటాయిస్తారు.

Tags:    

Similar News