క్రికెట్ అంటే ఇండియా.... మూడు ఫార్మెట్లలోనూ ఫస్ట్ ర్యాంక్!

ఇలా టీ-20, వన్ డే, టెస్ట్... మూడు ఫార్మేట్ లలోనూ ఇండియా ఫస్ట్ ప్లేస్ కి చేరుకోవడం ఇదే తొలిసారి.

Update: 2023-09-23 04:04 GMT

క్రికెట్ లో ఇండియాను కొట్టేవాడే లేడండి.. క్రికెట్ అనేది ఇండియాలో క్రీడ కాదు, ఒక రిలీజియన్ అండి.. వంటి మాటలు నిత్యం వినబడుతూనే ఉంటాయి. ఆ అభిమానుల కోరికల ఫలమో.. ఆ అభిమానులను నిరాశపరచకూడదనే క్రీడాకారుల పట్టుదల ఫలితమో తెలియదు కానీ... ప్రపంచ కప్ కు ముందు టీం ఇండియాకు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి.

ఈసారి ప్రపంచకప్ కు భారత్ వేదికవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీం ఇండియాకు ఆటలో అన్నీ వరుసగా శుభశకునాలే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆసీస్‌ తో మూడు వన్డేల సిరీస్‌ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌ లో భారత్‌ విజయం సాధించింది. ఫలితంగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

అవును... ఆస్ట్రేలియాపై మొదటీ మ్యాచ్ లో గెలిచిన అనంతరం 116 పాయింట్లతో నిలిచింది భారత్. దీంతో వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. భారత్ తర్వాత స్థానంలో 115 పాయింట్లతో పాకిస్థాన్ రెండో స్థానాన్ని సాధించగా.. 111 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది.

ఇప్పటికే భారత్ ఇటు టెస్టు ఫార్మెట్ లోనూ, అటు టీ-20 ఫార్మాట్‌ లోనూ తొలి ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. టెస్ట్ ఫార్మేట్ లో 118 పాయింట్లతో భారత్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది. టీంఇండియా తర్వాత టెస్టుల్లో 118 పాయింట్లతో ఆస్ట్రేలియా, 115 పాయింట్లతో ఇంగ్లాండ్‌ లు వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఆస్ట్రేలియాతో బోర్డర్‌ - గావస్కర్‌ సిరీస్‌ ను గెలుచుకోవడం, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ లో ఫైనల్‌ కు చేరుకోవడం, వెస్టిండిస్ తో టెస్టు సిరీస్‌ నెగ్గడంతో ఈ ఫీట్ ను సాధించగలిగింది. ఇదే సమయంలోనూ టీ-20 ఫార్మేట్ లోనూ టీం ఇండియా ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

టీ-20 ఫార్మెట్ లో భారత్ 264 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా.. 261 పాయింట్లతో ఇంగ్లాండ్, 254 పాయింట్లతో పాకిస్థాన్ లు వరూసగా రెండూ, మూడూ స్థానాల్లో నిలిచాయి. టీ-20 ప్రపంచ కప్‌ 2021 నుంచి ఇప్పటి వరకు మొత్త 14 సిరీసుల్లో 13 సిరీస్ లను గెలిచిన టీం ఇండియా ఈ టాప్ ర్యాంక్ ను సాధించింది.

ఇలా టీ-20, వన్ డే, టెస్ట్... మూడు ఫార్మేట్ లలోనూ ఇండియా ఫస్ట్ ప్లేస్ కి చేరుకోవడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News